ఎమ్మెల్యేల జంపింగ్…కేసీఆర్ కొత్త స్కెచ్..!

-

నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు కేటాయింపు విషయంలో తాజాగా టీఆర్ఎస్ శాసనసభపక్షా సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సిట్టింగులకే మళ్ళీ సీట్లు ఇస్తామని మాట్లాడారు. సిట్టింగ్‌లకే సీట్లనేది టీఆర్‌ఎస్‌ విధానమని, దాన్ని చెడగొట్టుకుంటే ఏమీ చేయలేమని, అంతా ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉందని, ఒకసారి చెబుతాం…రెండోసారి మాట్లాడతాం…అప్పటికి మారకుంటే అప్పుడు వేరేవాళ్లకు సీటు ఇవ్వక తప్పదని, ఇప్పుడు ఎన్నికలు జరిగినా 70 నుంచి 80 సీట్లు మనవే అని, కష్టపడితే 90 సీట్లు గెలుస్తామని, కాబట్టి ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేయాలని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

అయితే ఆ మధ్య పీకే టీం సర్వేలో 40 మందిపైనే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారికి మళ్ళీ సీటు ఇస్తే గెలవడం కష్టమని, కాబట్టి నెక్స్ట్ వారిని మార్చాల్సిందే అని కథనాలు వచ్చాయి. దీంతో కేసీఆర్ సైతం…కొందరు సిట్టింగులని మార్చడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరిగింది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు టెన్షన్ పడ్డారు. కానీ ఇప్పుడు సిట్టింగులకే సీటు అని కేసీఆర్ అంటున్నారు.

కానీ అప్పుడు కంటే కేసీఆర్ చెప్పిన మాటల్లో చాలా అంతరార్ధం ఉంది. అది ఏంటంటే…40 మంది ఎమ్మెల్యేల సీట్లు మార్చాలని కథనాలు వచ్చినప్పుడు…బీజేపీ ఓ పోలిటికల్ గేమ్ ప్లే చేసింది..టీఆర్ఎస్ పార్టీకి చెందిన 10-12 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వారు బీజేపీలోకి వచేస్తారని మాట్లాడారు. అంటే సీటు దక్కని వారు బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని అర్ధమైంది.

ఇప్పుడున్న పరిస్తితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళితే…టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని తగ్గించడానికే కేసీఆర్ ఇప్పుడు సిట్టింగులకే సీటు అని ఎమ్మెల్యేలని పార్టీ మారకుండా ఆపుతున్నట్లు అర్ధమవుతుంది. అంటే ఎన్నికలకు వరకు ఎలాగోలా ఎమ్మెల్యేలని నిలుపుకోవాలని, ఆ తర్వాత సీటు రాకపోతే వారికి ఏదో రకంగా సర్ది చెప్పవచ్చు అనేది కేసీఆర్ ప్లాన్ గా ఉందని తెలుస్తోంది. మరి కేసీఆర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news