పాకిస్తాన్‌ యువతి సీమా హైదర్‌ కేసు – తొలిసారి స్పందించిన సీఎం యోగీ

-

సీమా హైదర్ కేసుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. ANI అనే వార్తా సంస్థ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. సీమా హైదర్ కేసు రివర్స్ లవ్ జిహాదా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఇది రెండు దేశాలకు సంబంధించిన అంశం.దీనిపై భద్రతా సంస్థలు ఆరా తీస్తున్నాయి. వారు ఎలాంటి నివేదిక ఇచ్చినా దాని ఆధారంగా పరిశీలిస్తాం అని అన్నారు.అయితే దీనిపై లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం యోగీ

ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన సచిన్‌కి పబ్‌జీ గేమ్‌ ఆడటం హాబీ.ఆన్‌లైన్‌లో ఈ గేమ్‌ ఆడటం ద్వారా ఖండాంతర పరిచయాలను ఏర్పరచుకుంటున్నారు యువత. అలాగే సచిన్‌ కూడా పాకిస్థాన్‌లోని కరాచీలో నివాసముంటున్న సీమా హైదర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చాన్నాళ్ళ నుంచి చాటింగ్‌ చేసుకుంటూ చివరికి ప్రేమలో పడ్డారు. అలా ఈ రెండు హృదయాలను కలిపింది పబ్‌జీ గేమ్‌.అయితే తన ప్రియుడ్ని కలుసుకునేందుకు పాకిస్తాన్‌ నుంచి బయటికి వచ్చిన సీమా….నేపాల్‌ వచ్చి అక్కడి నుంచి భారతదేశ సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించింది.రబుపురా అనే ప్రాంతంలో సచిన్‌తో కలిసి ఆమె నివశించసాగింది.

ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఈ జంటపై స్థానికులు ఓ కన్నేసి పోలీసులకు అప్పగించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి జైలుకి తరలించారు. అయితే రెండు రోజుల తరువాత వారికి బెయిల్‌ ఇచ్చి విడుదల చేసింది అక్కడి కోర్ట్‌.ఆమె పాకిస్తాన్‌ నుంచి ఇక్కడ విధ్వంసం సృష్టించేందుకు వచ్చిందని చాలా మంది స్థానికులు,వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆమె మూలాలపై సమగ్రంగా విచారించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లవ్‌ జీహాదీ పేరుతో భారత దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిందంటూ ఆమెపై అటు బీజీపీ నేతలు కూడా మండిపడుతున్నారు.విచారణ పూర్తయ్యాకే దానిని పరిశీలిస్తామని సీఎం యోగీ చెప్పారు.
పోలీసులు విచారించారు.

తన ప్రేమ కహానీపై సీమా హైదర్‌ నోరువిప్పింది. సచిన్‌పై ఉన్న ప్రేమ కోసమే తాను ఇండియాకు వచ్చానని, ఇకపై ఇండియాలోనే ఉంటానని చెప్పింది. నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చిన సీమాకు భారత పౌరసత్వం ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సీమా మాత్రం తనకి తాను భారతీయురాలిగా భావించుకుటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మేరా భారత్ మహాన్’ బ్యాడ్జ్‌ను ధరించి, దేశభక్తి పాటతో తన స్వంత వీడియోను వైరల్ చేసింది.ఏది ఎలా ఉన్నా ఏదైనా ఉగ్రవాద సంస్థ ఆమెను ఇండియాకి పంపిందా అనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version