టీ కాంగ్రెస్ నేతలకు హై కమాండ్ నుంచి పిలుపు.. హుజూరాబాద్ ఓటమిపై చర్చ..!

-

హుజూరాబాద్ ఓటమి టీ కాంగ్రెస్ పార్టీలో ఓ చిన్నపాటి యుద్ధాన్నే రేపింది. ఇప్పటికే నేతలు పబ్లిక్ గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా పార్టీ శిక్షణ శిబిరం సందర్భంగా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీంతో కాంగ్రెస్ భవిష్యత్తుపై నాయకులకు అనుమానాలు ఏర్పడ్డాయి. మరోవైపు కాంగ్రెస్ లో అసంత్రుప్త నాయకులను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇటీవల కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రేం సాగర్ రావు వంటి నేతలు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే పార్టీ తీరుపై విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు హుజూరాబాద్ ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీరుపై హైకమాండ్ సీరియస్ గానే నజర్ పెట్టింది. తాజాగా టీ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో కాంగ్రెస్లో అలజడి మొదలైంది. హుజూరాబాద్ ఓటమి పైనే ప్రధాన చర్చ జరుగుతుందని తెలుస్తోంది. కేవలం 1.46 ఓట్లకే పరిమితం అవ్వడంతో ఏఐసీసీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈఓటమికి కారణాలేంటి, అభ్యర్థి ఎంపికలో ఏం జరిగిందనిా కాంగ్రెస్ అధిష్టానం ప్రశ్నించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news