మాజీ మంత్రి రాకతో కాంగ్రెస్‌లో కన్ఫ్యూజన్..ఆ రెండు సీట్లలో నో క్లారిటీ.!

-

కాంగ్రెస్ లోకి వలసల జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ సైతం కాంగ్రెస్ లో చేరడానికి రంగం చేసుకున్నారు. ఈయన బి‌జే‌పికి గుడ్ బై చెప్పి..కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

ఇక చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమే. కానీ ఈయన కాంగ్రెస్ లోకి వస్తే ఏ సీటు ఇస్తారనేది పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. ఎందుకంటే ఈయన గతంలో వికారాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి వికారాబాద్ నుంచి గెలిచారు. టి‌డి‌పి హయాంలో మంత్రిగా చేశారు. తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేసి..2004లో గెలిచారు. 2009లో ఓటమి పాలయ్యారు. 2014లో పోటీకి దిగలేదు. 2018 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి ఇండిపెడెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళి 2019 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

తర్వాత బి‌జే‌పిలోకి వెళ్లారు. కానీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్‌ని తప్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈయన బి‌జే‌పి నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ లో చేరితే వికారాబాద్ సీటు దక్కడం డౌటే. ఎందుకంటే అక్కడ సీనియర్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు.

ఇటు జహీరాబాద్ రిజర్వ్ సీటే..కానీ అక్కడ గీతారెడ్డి ఉన్నారు. దీంతో చంద్రశేఖర్‌కు ఏ సీటు ఇస్తారనేది క్లారిటీ లేదు. పార్లమెంట్ ఎన్నికలు తర్వాత ఉన్నాయి కాబట్టి..చంద్రశేఖర్ ముందు అసెంబ్లీ సీటుపైనే ఫోకస్ పెట్టారు. మరి చంద్రశేఖర్‌కు ఏ సీటు ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version