కాంగ్రెస్‌లో చేరికల జోరు..కారు-కమలం వ్యూహాలు.!

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. పైగా ఇటీవల సీనియర్ నేతలంతా ఏకతాటి పై నడుస్తున్నారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి రెడీ అయ్యారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపు పెరిగింది. ఇదే క్రమంలో తెలంగాణ మొన్నటివరకు రేసులోకి దూసుకొచ్చిన బి‌జే‌పి నిదానంగా వెనుకబడుతుంది. పైగా ఆ పార్టీలో చేరికలు కూడా తగ్గుముఖం పట్టాయి.

రాష్ట్ర స్థాయిలో బి‌జే‌పికి బలం తక్కువగానే ఉంది. ఏదో కొన్ని స్థానాలు మినహా..మిగిలిన స్థానాల్లో బి‌జే‌పికి బలం గాని.. నాయకులు గాని లేరు..దీంతో నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పైగా కర్ణాటక ఎన్నికల్లో గెలవడంతో కాంగ్రెస్ లోకి వలసలు జోరు పెరిగింది. తాజాగా పార్టీలోకి కీలక నేతలు వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి  నియోజకవర్గానికి చెందిన కీలక నేత మట్టా దయానంద్ కాంగ్రెస్ కడువా కప్పుకున్నారు. 2014లో ఈయన వైసీపీ నుంచి పోటీ చేసి సత్తుపల్లిలో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. 2018లో సీటు రాలేదు. తర్వాత పార్టీలో ప్రాధాన్యత లేదు.

May be an image of 7 people

ఈ క్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నడిచారు. కానీ పొంగులేటి ఎటు వెళ్తారో తేల్చడం లేదు. దీంతో మట్టా..అనూహ్యంగా కాంగ్రెస్ లోకి వచ్చేశారు. ఇటు మెదక్ లో పటోళ్ళ శశిధర్ రెడ్డి..తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. గతంలో ఈయన కాంగ్రెస్ లోనే పనిచేశారు..గత ఎన్నికల తర్వాత బి‌జే‌పిలోకి వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. బి‌జే‌పికి మెదక్ లో పెద్ద పట్టు లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు.

ఇక కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతుండటంతో బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి అలెర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా బి‌జే‌పి కాంగ్రెస్ వలసలకు బ్రేక్ వేసి..తమ పార్టీలోకి వలసలు పెంచాలని చూస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలా మారతాయో.

Read more RELATED
Recommended to you

Latest news