కాంగ్రెస్‌లో ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు..చేరికలు..అలకలు.!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. రెండుసార్లు ఓటమి పాలై..అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి..ఈ సారి అధికారం దక్కించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతుంది. ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి రేసులోకి వచ్చింది. అలాగే చేరికలు కూడా మొదలయ్యాయి. అయితే చేరికలు భారీగా ఉండేలా ఉన్నాయి.

కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో భారీ మలుపు అని చెప్పవచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారు. ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి లతతో పాటు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంకా కొందరు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ చేరికల విషయంలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళుతున్నారు. వరుసపెట్టి పార్టీలోకి వచ్చే నేతలతో భేటీ అవుతున్నారు.

తాజాగా ఆయన జూపల్లి కృష్ణారావుని కలిశారు.  కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన జూపల్లిని కలిశారు. త్వరలోనే భారీ చేరికలు ఉంటాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో చేరికల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్త అలిగినట్లు తెలిసింది. తన జిల్లాకు చెందిన వేముల వీరేశంని, అలాగే కోదాడకు చెందిన బి‌ఆర్‌ఎస్ నేత శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంపై తనతో చర్చలు చేయలేదని ఉత్తమ్ అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పటికే కోమటిరెడ్డిని కలిసి చేరికల గురించి చెప్పిన రేవంత్..ఉత్తమ్, జానారెడ్డి, భట్టిలతో మాట్లాడే పార్టీలోకి నేతలని చేర్చుకుంటామని అంటున్నారు. ఇలా ఊహించని విధంగా కాంగ్రెస్ చేరికలతో పాటు అలకలు కూడా నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news