హస్తం సెంటిమెంట్…మునుగోడులో కలిసొస్తుందా?

-

మునుగోడులో అధికార టీఆర్ఎస్, బీజేపీలూ బాగా దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే…ఇంకా చెప్పాలంటే బీజేపీనే మరింత దూకుడుగా రాజకీయం చేస్తుంది…అసలు టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం అవకాశం కూడా ఇవ్వట్లేదు. అయితే అధికారంలో ఉండటం టీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అంశం..అధికార బలంతో ఆ పార్టీ కూడా దూకుడుగానే ఉంది…ఎలాగైనా ముందుగోడు దక్కించుకుని సత్తా చాటాలని చూస్తుంది.

 

ఎటు తిరిగి కాంగ్రెస్ పార్టీ పరిస్తితి గందరగోళంగా ఉంది..ఓ వైపు సొంత పార్టీలో లుకలుకలు ఎక్కువయ్యాయి. ఎవరికి వారు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. దీని వల్ల పార్టీ పరిస్తితి మరింత దిగజారుతుంది..అదే సమయంలో మునుగోడులో మిగిలి ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులని ఓ వైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీలు లాగేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది నాయకులని లాగేశారు. దీంతో కాంగ్రెస్ ఇప్పుడు కార్యకర్తలపైనే ఆధారపడి ఉండాల్సిన పరిస్తితి

ఇలాంటి తరుణంలోనే రేవంత్ రెడ్డి మునుగోడులో ఎంట్రీ ఇస్తున్నారు…అక్కడే మకాం వేసి పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారు. అదే క్రమంలో తమ నాయకులని లాగేస్తున్నారు…తమకు అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ సెంటిమెంట్ తో ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయనుంది. తనతో సహా వెయ్యి మంది కాంగ్రెస్‌ నాయకులు.. ఒక్కో నాయకుడు 100 మంది ఓటర్లకు వందనం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ మునుగోడులో తిరుగుతారని రేవంత్ చెప్పారు. అలాగే మునుగోడు లో ఉండే ప్రతి గ్రామానికి ఇంచార్జ్ ని పెట్టారు..వారు ఓటర్లని ఆకట్టుకునే విధంగా ముందుకెళ్లనున్నారు.

అయితే హోరాహోరీగా జరుగుతున్న పోరులో ప్రజలు కాంగ్రెస్ వైపు ఏ మేరకు చూస్తారనేది డౌటే…ఎందుకంటే ఓ వైపు బలమైన అధికార పక్షం టీఆర్ఎస్ ఉంది…అటు బలపడుతున్న బీజేపీ ఉంది..ఏ రెండిటి మధ్యలోనే ఫైట్ జరిగేలా ఉంది. అలాంటప్పుడు ఆ రెండు పార్టీలని ఎదురుకుని కాంగ్రెస్ ఏ మేర మునుగోడులో రాణిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version