‘పవన్ నాపై పోటీ చెయ్’..ద్వారంపూడిని కాకినాడలో ఓడించలేరా?

-

గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్..కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. గతంలో పవన్‌ని ద్వారంపూడి బండ బూతులు తిట్టడం, జనసేన మహిళలపై ద్వారంపూడి అనుచరులు దాడి చేయడంతో..తాజాగా కాకినాడ వచ్చిన పవన్..ద్వారంపూడిపై విరుచుకుపడ్డారు.

ద్వారంపూడి లాంటి డెకాయిట్ లని జనసేన అధికారంలోకి రాగానే రోడ్డుకు ఈడుస్తామని..ద్వారంపూడి ఫ్యామిలీ అక్రమ బియ్యం, భూ కబ్జాలు చేసి వేల కోట్లు సంపాదిస్తుందని పవన్ ఆరోపించారు. దీనికి ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. అయినా పవన్ వెనక్కి తగ్గలేదు..ద్వారంపూడిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ద్వారంపూడి మళ్ళీ రియాక్ట్ అవుతూ.. చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ కళ్యాణ్ కాకినాడ‌లో తనపై పోటీ చేయాలని ఎద్దేవా చేస్తూ సవాల్ చేశారు. నారావారి వాహనంలో ద్వారంపూడి జపం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి వస్తుందని , పవన్ తనపైన లేని పోనీ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

ఇలా సవాల్ చేయడంతో ద్వారంపూడి ప్రాతినిధ్యం వహించే కాకినాడ సిటీపై చర్చ జరుగుతుంది. అంటే అక్కడ పవన్ పోటీ చేసిన ద్వారంపూడిని ఓడించలేరా? అందుకే ఆయన సవాల్ చేశారా? అంటే గెలుపుపై ద్వారంపూడికి ధీమా ఉంది గాని..ఒకవేళ టి‌డి‌పి, జనసేన గాని విడిగా పోటీ చేస్తే మళ్ళీ ద్వారంపూడి గెలిచే ఛాన్స్ ఉంది. అలా కాకుండా కలిసి పోటీ చేస్తే సీన్ మారుతుంది.

గత ఎన్నికల్లో ద్వారంపూడికి 73 వేల ఓట్లు వస్తే,. టి‌డి‌పికి 60 వేలు, జనసేనకు 30 వేల ఓట్లు పడ్డాయి. ఇలా ఓట్లు చీలడంవల్ల ద్వారంపూడి గెలిచారు. అదే టి‌డి‌పి, జనసేన ఓట్లు కలిస్తే 90 వేలు..ద్వారంపూడి కంటే 17 వేలు ఎక్కువ. 2009లో కూడా ఈయన ఓట్లు చీలడం వల్లే గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ద్వారంపూడికి 44 వేల ఓట్లు వస్తే, ప్రజారాజ్యంకు 35 వేలు, టి‌డి‌పికి 25 వేలు వచ్చాయి. కాబట్టి..టి‌డి‌పి, జనసేన కలిస్తే కాకినాడ సిటీలో ద్వారంపూడికే రిస్క్. అయినా సరే పవన్‌ని పోటీ చేయాలని సవాల్ చేయడం ఒక రాజకీయ ఎత్తుగడ అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version