తెలంగాణ విమోచన దినంపై ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిర్మల్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కలిసి పాలొన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని అసెంబ్లీ వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నోసార్లు డిమాండ్ చేశామని… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం దుర్దినమని మండిపడ్డారు..

etala
etala

ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని మరోసారి డిమాండ్ చేస్తున్నానని… రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జండా కాషాయ జెండానేనన్నారు. 2023 లో భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో విజయదుందుభి మోగించి సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని మనవి చేస్తున్నామని… హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్య సాంప్రదాయాల విలువలు లేవు, అక్కడ ఏం జరుగుతుందో మీరంతా గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా… గెలుపు బీజేపీ పార్టీదేనని స్పష్టం చేశారు.