ఏపీలో రాజకీయం హోరాహోరీగా జరుగుతుంది…ఓ వైపు అధికార వైసీపీ తనదైన శైలిలో రాజకీయం చేసుకుంటూ ముందుకెళుతుంటే…మరోవైపు ప్రతిపక్ష టీడీపీ…వైసీపీకి ధీటుగా ఎదిగేందుకు చూస్తుంది. ఎప్పటికప్పుడు రెండు పార్టీలు సరికొత్త వ్యూహాలతో రాజకీయం చేస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో ఉన్న రాజకీయ పరిస్తితులు ఇప్పుడు లేవు…అప్పుడు పూర్తిగా వైసీపీకి అనుకూలమైన పరిస్తితులు ఉన్నాయి…కానీ ఇప్పుడు సీన్ మారుతుంది..వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా వస్తుంది.
ఎక్కడకక్కడ టీడీపీ నేతలు దూకుడుగా ఉంటూ…వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో విఫలమై…టీడీపీ నేతలకు ప్లస్ చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని పెంచుకుంటూ…టీడీపీకి పికప్ అయ్యే అవకాశాలు ఇస్తున్నారు. పనితీరు మెరుగు పర్చుకోవాలని జగన్ క్లాస్ పీకిన సరే కొందరు ఎమ్మెల్యేల్లో మార్పు రావడం లేదని తెలుస్తోంది. దీని వల్ల కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు డౌన్ అయ్యి…టీడీపీ నేతలు పికప్ అవుతున్నారు.
ముఖ్యంగా కొత్త గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీ నేతలకు ప్లస్ అవుతున్నారు. గుంటూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు ఈస్ట్, వెస్ట్, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క గుంటూరు వెస్ట్ మినహా మిగిలిన సీట్లలో వైసీపీ గెలిచింది. వెస్ట్ ఎమ్మెల్యే సైతం వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో గుంటూరు మొత్తం వైసీపీ చేతుల్లో ఉంది.
కానీ కొందరు ఎమ్మెల్యేలు సరైన పనితీరు కనబర్చక టీడీపీ నేతలకు బలపడే అవకాశాలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలకు గెలిచే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అలా గెలుపుకు దూరమవుతున్న వారిలో తాడికొండ, పొన్నూరు ఎమ్మెల్యేలు ముందు ఉన్నారు. ఈ రెండుచోట్ల టీడీపీ ఎడ్జ్ లోకి వచ్చిందని తెలుస్తోంది. అటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సైతం ఈ సారి గెలుపు కష్టమయ్యేలా ఉందని ప్రచారం జరుగుతుంది…అలాగే గుంటూరు వెస్ట్ లో జంపింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరి పరిస్తితి కూడా బాగోలేదని తెలుస్తోంది. అయితే నెక్స్ట్ టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ చేస్తే…ప్రత్తిపాడు, తెనాలి, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలుపు కష్టమే అని తెలుస్తోంది. మొత్తానికైతే గుంటూరులో టీడీపీని వైసీపీ ఎమ్మెల్యేలే పైకి లేపుతున్నారు.