ఇండియన్ పార్లమెంట్ లో అగ్నిప్రమాదం

-

పార్లమెంట్ అనెక్స్ అంటే అనుబంధ భవనంలోని ఆరవ అంతస్తులో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. అనెక్స్ భవనంలోని ఆరో అంతస్థులో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఐదు ఫైరింజన్లను రంగంలోకి దిగాయి. నిజానికి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కరోనా కారణంగా సెప్టెంబర్ మూడో వారంలో ఈ సమావేశాలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. దానిని బట్టి ఎంపీల మధ్య సోషల్ డిస్టాన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రేడియేషన్ పద్ధతి ద్వారా ఆల్ట్రా వైలెట్ కిరణాల్ని ప్రసరింపచేసి వైరస్‌ను నాశనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ హౌస్ అనెక్స్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోడీ 2017లో ప్రారంభించారు. ఈ బిల్డింగ్ లో పలు పార్లమెంటరీ కమిటీల కార్యాలయాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news