ప్రధాని మోదీ తెలంగాణకు వ్యతిరేఖి అని తెలిసిపోయింది… హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

-

రాజ్య సభ వేదికగా ప్రధాని తెలంగాణ వ్యతిరేఖి అన్న విషయం అర్థమైందని… ప్రధాని మోదీ, బీజేపీ ప్రభత్వం తెలంగాణకు వ్యతిరేఖంగా ఉందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రజల మనసులను ప్రధాని మోదీ వ్యాఖ్యలు గాయపరిచాయన్నారు. తెలంగాణపై ఇంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇన్ని బలిదాానాలు జరిగేవా అని ప్రశ్నించారు. ఇంత మంది బలిదానాలకు కాంగ్రెస్, బీజేపీ కారణం కాదా..అని ప్రశ్నించారు. 2009లో ఇచ్చిన తెలంగాణను వాపస్ తీసుకోకుంటే మా విద్యార్థులు అమరులు అయ్యేవారా అని అన్నారు. తెలంగాణ ప్రజల్ని ప్రధాని మోదీ అవమానిస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్లు అయినా విభజన హమీలు ఎందుకు నెరవేర్చడం లేదని కేంద్రాన్ని అడిగారు. తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన అన్నారు. ఏడేళ్లు అయినా గిరిజన యూనివర్సిటీని ఎందుకు పెట్టడం లేదన్నారు. తెలంగాణపై మీకేందుకు ఇంత వివక్ష, కక్ష అంటూ ఘాటుగా విమర్శించారు. తెలంగాణ బీజేపీ నేతలు ఏం మోహం పెట్టుకుని మాట్లాడుతారు ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news