అప్పులు కుప్పగా ఏపీ.. పురందేశ్వరి మాటల్లో నిజమెంత?

-

అధికారంలో ఉండే పార్టీపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సహజమే.. ఇది ఎక్కడైనా జరుగుతుంది.. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఆరోపణలు అనేవి వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అలా కాకుండా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు..వాస్తవానికి దూరంగా విమర్శలు చేస్తే వాటిని ప్రజలు నమ్మే పరిస్తితి ఉండదు. ఇక తాజాగా ఏపీ బి‌జే‌పి అధ్యక్షురాలు రాష్ట్రం అప్పులపై చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు 97,000 కోట్లు ఉన్నాయని, 2019 మార్చ్ 31 నాటికి, అంటే చంద్రబాబు దిగిపోయేనాటికి ఏపీ మీద ఉన్న అప్పు 3,62,375 కోట్లు అని చెప్పారు. దీని బట్టి ఐదేళ్ళలో చంద్రబాబు చేసిన అప్పు 2,65, 365 కోట్లు అని అన్నారు.

daggubati purandeswari
daggubati purandeswari

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి…18 జులై 2023 నాటికీ ఏపీ అప్పు10,77,006 కోట్లు అని, అంటే వైసిపి చేసిన అప్పు 7,14,631 కోట్లు  అని చెప్పారు. అయితే ఈ అప్పుల విషయంలో అసలు వాస్తవాలు ఏంటంటే.. రాష్ట్ర విభజననాటికి ఉన్న అప్పు 1,32,079 కోట్లు…టిడిపి దిగిపోయేనాటికి రాష్టం అప్పులు 3,31,054 కోట్లు (వార్షిక పెరుగుదల 20. 17 శాతం).

2023 మార్చ్ నాటికి ఏపీ అప్పులు 5,87,317 కోట్లు ( 16. 13 శాతం ). రాష్ట్ర విభజననాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు 1,53,346 కోట్లు..టిడిపి దిగిపోయేనాటికి ఉన్న అప్పులు 4,12,288 కోట్లు(వార్షిక పెరుగుదల 21.87 శాతం). 2023 మార్చి నాటికి  అప్పులు 6,51,789 కోట్లు.

టీడీపీ పాలనతో పోలిస్తే సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువే అని కాగ్ చెబుతోంది. అదే సమయంలో మూలధన వ్యయం చాలా ఎక్కువ అని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. చంద్రబాబు హయాంలో ఐదేళ్ళలో రూ. 76,139 కోట్లు ఖర్చు చేశారు.. అంటే సరాసరి ఏడాదికి రూ.15,225 కోట్లు కాగా సీఎం వైయస్ జగన్ వచ్చాక నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు ఖర్చు చేశారు. అంటే సరాసరి ఏడాదికి రూ.18,852 కోట్లు .. సామాజిక ఆస్తుల పెంపునకు ఖర్చు చేసినట్లు లెక్క .

ఇక అన్నీ ప్రతిపక్షాలతో పాటు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాలేదని పురంధేశ్వరి అంటున్నారు. అయితే వాస్తవానికి టిడిపి జమానాలో రోడ్లకు పెట్టిన ఖర్చు  రూ.3,160 కోట్లు. సీఎం వైయస్ జగన్ వచ్చాక నాలుగేళ్లలో రోడ్లకు పెట్టిన ఖర్చు రూ.4,493 కోట్లు. అలాగే ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదని చెబుతున్నారు. అయితే బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్ జీతాల బిల్లు రూ.23,997 కోట్లు(2021-22 ఏప్రిల్ – అక్టోబర్ వరకు) గుజరాత్ : రూ.7,789 కోట్లు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జీతాల బిల్లు 24,681 కోట్లు.

అలాగే 2018–19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు రూ.53,811 కోట్లు. 2020-21లో ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల చెల్లింపులకు రూ.66,470 కోట్లు. ఇన్ని సమస్యలు.. చంద్రబాబు వదిలేసి వెళ్లిన జెన్- కో బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లుల వంటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ప్రజలకు వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.2.20 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమచేశారు. కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినా ఏక్కడా ఏ పథకమూ ఆగలేదు.. ఏ వర్గమూ ఇబ్బంది పడలేదు.. ఇవన్నీ కనబడలేదా కొత్త బిజెపి ప్రెసిడెంట్ గారూ!!

Read more RELATED
Recommended to you

Latest news