సీమలో లోకేష్‌కు సక్సెస్ దక్కినట్లేనా..వైసీపీ ఆధిక్యం దాటలేదా?

-

జనవరి 27 నుంచి జూన్ 12 వరకు రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగిన విషయం తెలిసిందే. దాదాపు 1500 కిలోమీటర్ల పైనే లోకేష్ పాదయాత్ర జరిగింది. మరి సీమలో లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయిందా..అక్కడ టి‌డి‌పికి బలం పెరిగిందా? వైసీపీ ఆధిక్యానికి గండి కొట్టారా? అంటే..లోకేష్ పాదయాత్ర నుంచి మాట్లాడుకుంటే..కుప్పంలో పాదయాత్ర మొదలైంది.

ఎలాగో అది టి‌డి‌పి కంచుకోట కాబట్టి అక్కడ పాదయాత్ర సక్సెస్ అయింది. కానీ తర్వాత పాదయాత్ర అనుకున్న మేర విజయం సాధించలేదు. రాష్ట్ర స్థాయిలో హైలైట్ కాలేదు. కానీ పలమనేరు, పీలేరు, నగరి లాంటి చోట్ల భారీ స్థాయిలో సక్సెస్ అయింది. ఇక తర్వాత తర్వాత లోకేష్ పాదయాత్రకు ఊపు వచ్చింది. ఇక ప్రజల్లో ఉండటం, ప్రజా సమస్యలు తెలుకోవడం, అన్నీ వర్గాలతో లోకేష్ మాట్లాడటం..వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పడం లాంటి అంశాలు ఆకట్టుకున్నాయి. అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర విజయవంతంగానే సాగిందనే చెప్పాలి. నెక్స్ట్ కడపలో కూడా లోకేష్ పాదయాత్రకు ప్రజా స్పందన బాగా వచ్చింది.

అయితే లోకేష్ పాదయాత్ర వల్ల సీమలో టి‌డి‌పికి కాస్త ఊపు వచ్చిన మాట వాస్తవం..కానీ మూలాల వరకు వెళ్ళి అక్కడ నుంచి పార్టీకి ఊపు తీసుకురావడంలో సక్సెస్ కెలకపోయారు. మొదట నుంచి సీమలో టి‌డి‌పికి అనుకున్న విధంగా పట్టు లేదు. ఇప్పుడు పైపైన పార్టీకి ఊపు తెచ్చారు. కింది స్థాయి నుంచి పార్టీ బలోపేతంలో అనుకున్న మేర సక్సెస్ కాలేదు.

ఇక లోకేష్ పాదయాత్ర బద్వేలు ముగిసి..నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ కాబోతుంది. అయితే లోకేష్ పాదయాత్ర తర్వాత సీమ నాయకులు ప్రజల్లో ఉంటూ పనిచేస్తే..పాదయాత్రకు ఏమైనా అర్ధం ఉంటుంది. ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే సీమలో వైసీపీ ఆధిక్యం కొనసాగుతూనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news