రోజా-రజిని-వనిత-ఉషశ్రీ..ఈ సారి గట్టెక్కేది ఎవరు?

-

గత ఎన్నికల్లో మంత్రులుగా పనిచేసిన మహిళా నేతలు ఏ ఒక్కరూ కూడా గెలవలేదు. గత టి‌డి‌పి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన మహిళా నేతలు ఓటమి పాలయ్యారు. అయితే అందులో కొందరు పోటీ చేయలేదు..కొందరు పోటీ చేసిన సరే గెలవలేదు. పరిటాల సునీతమ్మ, కిమిడి మృణాలిని, పీతల సుజాత లాంటి వారు పోటీ చేయలేదు. ఇక భూమా అఖిలప్రియ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అయితే ఈ సారి మంత్రులుగా పనిచేసే మహిళా నేతలు ఎంతమంది గెలుస్తారు..మహిళా మంత్రుల గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే అంశాలు ఒక్కసారి చూస్తే..ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు రోజా, విడదల రజిని, ఉషశ్రీ చరణ్, తానేటి వనిత.

అంతకముందు సుచరిత, పుష్పశ్రీ వాణి మంత్రులుగా చేశారు.  వీరిలో మొదట రోజా గురించి చూస్తే..గత రెండు ఎన్నికల్లో వరుసగా నగరి నుంచి స్వల్ప మెజారిటీలతోనే గెలుస్తూ వచ్చారు. ఈ సారి ఎన్నికల్లో ఆమెకు ప్రతికూల అంశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పైగా సొంత పార్టీలోని కొందరు నేతలు యాంటీగా ఉన్నారు. ఈ పరిస్తితుల్లో నగరిలో రోజా ఈ సారి కాస్త గడ్డు పరిస్తితులు ఎదురుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక తొలిసారి గెలిచి సంచలనం సృష్టిస్తూ భారీ క్రేజ్ తెచ్చుకున్న మంత్రి విడదల రజినికి..ఈ సారి చిలకలూరిపేటలో ఈజీగా గెలవడం కష్టమని తెలుస్తోంది. ఆమెకు క్రేజ్ ఉంది గాని..అదే సమయంలో అపోజిట్ లో టి‌డి‌పి సీనియర్ ప్రత్తిపాటి పుల్లారావు బలపడుతున్నారు. ఈ సారి రజిని గట్టి పోటీ ఎదురుకునే ఛాన్స్ ఉంది. అటు కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీకు అనుకూల పరిస్తితి కనిపించడం లేదు. కాకపోతే అక్కడ టి‌డి‌పిలో గ్రూపు తగాదాలు ఉండటం మంత్రికి కలిసొస్తుంది. ఒకవేళ టి‌డి‌పి నేతలు కలిసి పనిచేస్తే ఉషశ్రీకి రిస్క్.

ఇటు కొవ్వూరులో వనితకు టీడీపీలోని గ్రూపు తగాదాలే ప్లస్. టి‌డి‌పిలో గాని నేతలు సర్దుకుని పనిచేస్తే..వనితకు గెలుపు డౌటే. అటు మాజీ మంత్రులు సుచరితకు ప్రత్తిపాడులో రిస్క్ ఉంది. ఇటు పుష్పశ్రీ వాణికి కూడా కురుపాంలో ఈ సారి గెలుపు సులువు కాదని తెలుస్తోంది. మొత్తానికి మహిళా మంత్రులు గెలవడానికి కాస్త కష్టపడాలి.

Read more RELATED
Recommended to you

Latest news