ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీపై ప్రజా వ్యతిరేకత కామన్ గానే ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఆ వ్యతిరేకతని ఎంత తగ్గించుకుని, మళ్ళీ ప్రజా మద్ధతు పొందుతారో వారే మళ్ళీ గెలవగలరు. ఇప్పుడు అదే దిశగా జగన్ పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై ప్రజా వ్యతిరేకత బాగానే ఉంది. అయితే టిడిపి వాళ్ళు అంటున్నట్లు విపరీతమైన వ్యతిరేకత లేదు..అలాగే వైసీపీ వాళ్ళు అనుకున్నట్లు ప్రజలంతా వైసీపీ వైపు లేరు.
ఎంత కాదు అనుకున్న జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే చెప్పాలి. కాకపోతే ఆ వ్యతిరేకత జగన్ పై లేదు గాని..ఆ పార్టీ ఎమ్మెల్యేల పైనే ఎక్కువ ఉంది. అందుకే ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉన్న ఎమ్మెల్యేలకు జగన్ ఎప్పటికప్పుడు క్లాస్ ఇస్తున్నారు. పనితీరు మెరుగు పర్చుకోకపోతే వారిని మార్చేస్తానని అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ జగన్ చేసిన మంచి పని ఏంటంటే..ఎమ్మెల్యేలని గడపగడపకు పంపడం..ఎన్నికలకు రెండేళ్ళు సమయం ఉండగానే గడపగడపకు కార్యక్రమం పెట్టి ఎమ్మెల్యేలని ప్రజల వద్దకు పంపడం.
సాధారణంగా అధికారంలో ఉన్న వారు ప్రజల దగ్గరకు వెళ్ళడం కష్టమే. ఏదో ఎన్నికల మును ప్రజల్లోకి వెళ్తారు. గతంలో టిడిపి ఎమ్మెల్యేలు అదే చేశారు. అప్పటికే వ్యతిరేకత ఉండటంతో ఎమ్మెల్యేలు..ప్రజల్లోకి వెళ్ళిన ప్రయోజనం ఉండదు. ఎన్నికలకు పెద్ద సమయం కూడా ఉండదు. దీని వల్ల యూజ్ ఉండదు.
కానీ జగన్ ముందే పంపారు. అయితే మొదటలో ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసనలు వచ్చాయి. కానీ అవి నిదానంగా తగ్గుతూ వచ్చాయి. ఇటు జగన్ సైతం ఏదొక కార్యక్రమంతో నియోజకవర్గాలకు వెళ్ళడం..భారీ సభలు పెట్టడం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏదొక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఎన్నికల్లో గెలవడానికి జగన్ ప్రీ-ప్లాన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇది వర్కౌట్ అయ్యి..చంద్రబాబుకు మళ్ళీ భారీ దెబ్బ తగలడం ఖాయం.