ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం ఏమో గాని రాజ్యసభ సీట్ల వ్యవహారం మాత్రం ఆశ్చర్యంగా మారింది. రాజ్యసభ సీటు ఎవరికి వస్తుంది అనేది ఇప్పడు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆరుగురు కీలక నేతలు రాజ్యసభ సీట్ల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయోధ్య రామిరెడ్డి, వైఎస్ షర్మిల మధ్య గట్టి ఉందని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చలు జరుగుతున్నాయి.
షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు ఇప్పటికే వెళ్లి తనకు రాజ్యసభ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఇది పక్కన పెడితే ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం రాజ్యసభకు లింక్ అయింది. గుంటూరు జిల్లాకు చెంది మోపిదేవి వెంకటరమణ, ఉత్తరాంధ్రకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి క్రుపారాణి, రాయలసీమకు చెందిన వైఎస్ షర్మిల ను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది అంటున్నారు.
అంటే రాజ్యసభ సీట్ల వ్యవహారంలో మూడు రాజధానుల వ్యూహమే అమలు చేస్తూ మూడు ప్రాంతాలకు చెందిన నాయకులకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని జగన్ ముందు డిమాండ్లు పెడుతున్నారు. పార్టీ బలంగా ఉంది కాబట్టి మూడు ప్రాంతాలకు చెందిన నాయకులను రాజ్యసభకు పంపాలి అంటున్నారు. నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఒక స్థానం ఎలాగూ… అంబాని సూచించిన నత్వాని తీసుకుంటారు.
కాబట్టి ఇప్పుడు మూడు స్థానాలకు ఆ విధంగానే ఎంపిక చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే రాజ్యసభ సీట్ల వ్యవహారం ఇప్పుడు జగన్ కు చికాకుగా మారింది అనే మాట నిజం. ఇక వ్యాపారవేత్త లకు, వలస నేతలకు అసలు రాజ్యసభ సీట్లు ఇవ్వొద్దని జగన్ ని కోరుతున్నారు నేతలు.