జగన్ వర్సెస్ పవన్..గెలిచేదెవరు?

-

అదేంటి జగన్ వర్సెస్ చంద్రబాబు కదా మెయిన్…మరి జగన్ వర్సెస్ పవన్ ఏంటి? అసలు జగన్ ఇప్పటికే పైచేయి సాధించి ఉన్నారు…మరి అలాంటప్పుడు..మళ్ళీ కొత్త వార్ ఏంటి అని డౌట్ రావొచ్చు. రాష్ట్రంలో వాస్తవ పరిస్తితులని గమినిస్తే చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లే నడుస్తున్నాయి. టీడీపీ-వైసీపీల మధ్యే మెయిన్ ఫైట్ నడుస్తోంది. కానీ ఈ ఫైట్ లో పవన్ కల్యాణ్ కీలకం కానున్నారు…ఆయన వల్లే జగన్ కు రిస్క్ ఎక్కువ ఉంది…ఒకవేళ పవన్ గాని…బాబుతో కలిస్తే జగన్ కు గెలుపు అవకాశాలు తగ్గుతాయి.  ఈ విషయం గతంలోనే రుజువైంది.

ఎందుకంటే 2014లో టీడీపీకి పవన్ సపోర్ట్ చేయడం వల్ల వైసీపీకి బాగా నష్టం జరిగింది…తక్కువ ఓట్ల శాతంతో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో పవన్ సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి…టీడీపీకి డ్యామేజ్ జరగడం, వైసీపీకి బెనిఫిట్ జరగడం జరిగిపోయాయి. అంటే పవన్ గెలవలేరు గాని…గెలుపోటములని తారుమారు చేయగలరు.

అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ గాని…బాబుతో జట్టు కడితే జగన్ కు ఇబ్బంది. గత ఎన్నికల్లో వీరు కలిసి ఉంటే వైసీపీకి గట్టి పోటీ వచ్చేది…అయినా సరే జగన్ వేవ్ వల్ల వైసీపీకే అధికారం దక్కేది. కానీ ఈ సారి జగన్ వేవ్ తక్కువగా ఉంది..ఇలాంటి సమయంలో టీడీపే-జనసేన కలిసొస్తే వైసీపీకి గెలుపు కష్టం. అందుకే ఈ మధ్య జగన్ సైతం పవన్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.

పైగా కాపు ఓటర్లు తమకు దూరం అవుతారనే అంశం జగన్ కు బాగా తెలిసింది…కాపులు పవన్ కు దగ్గరవుతున్నారని జగన్ మాటల్లోనే తెల్సింది..ఇటీవల జగన్ మాట్లాడుతూ..కాపు ఓట్లని గంపగుత్తగా చంద్రబాబుకు అమ్మేసేందుకు పవన్ రెడీ అయ్యారని మాట్లాడారు. అంటే ఇక్కడ అమ్మడం పక్కన పెడితే…కాపులు పవన్ వైపు ఉన్నారని తెలుస్తోంది. అందుకే పవన్ ని జగన్ టార్గెట్ చేశారు. ఒకవేళ పవన్ గాని టీడీపీ వైపుకు వెళితే..తన గెలుపు అవకాశాలు తగ్గుతాయని భావించి..కాపుల్లో బలం పెంచుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. మరి ఈ పోరులో ఎవరుపైచేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news