కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి అవుట్..అసలు గేమ్ స్టార్ట్?

-

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యవహారం బాగా టాపిక్ అయిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష స్థానంలో ఉన్న ఈయన…టీఆర్ఎస్‌పై పోరాటం చేయడం కంటే సొంత పార్టీపైనే ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఎప్పుడు ఏదొక విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా రేవంత్ రెడ్డి…తనని ఏ కార్యక్రమానికి పిలవడం లేదని, తన జిల్లాలో జరిగే కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని చెప్పి..ఏకంగా రేవంత్ రెడ్డిని పి‌సి‌సి పదవి నుంచి తప్పించాలని సోనియా గాంధీకి లేఖ రాశారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

పైగా ఆ లేఖ బహిరంగమైంది. దీంతో జగ్గారెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సీరియస్ అయింది. దీనికి జగ్గారెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. అసలు ముందు రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జగ్గారెడ్డి టీఆర్ఎస్ కోవర్టు అనే ప్రచారం మొదలైంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలు మాట్లాడుకునే పరిస్తితి. అలాగే జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోతారంటూ ప్రచారం జరుగుతుంది.

దీనిపై కూడా జగ్గారెడ్డి సీరియస్ అవుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అవుతున్నారు. తాను కాంగ్రెస్‌కు వీరాభిమానిని అని, కాంగ్రెస్‌లోనే ఉంటానని, సోనియా, రాహుల్‌లకు జరిగింది చెబుతానని అంటున్నారు. అంతగా కుదరకపోతే కాంగ్రెస్‌ని వీడి ఇండిపెండెంట్‌గా ఉంటానని అంటున్నారు.

అయితే జగ్గారెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ శ్రేణులు అనుమానంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా ఉంటానని కొత్త గేమ్ మొదలుపెట్టారని, ఆయన అన్నీ చూసుకుని టీఆర్ఎస్‌లోనే చేరిపోతారంటూ కాంగ్రెస్‌లో కొన్ని వర్గాలు ఫైర్ అవుతున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్…బీజేపీని లేపి కాంగ్రెస్‌ని తగ్గించడానికి చూస్తుందని, ఇటు జగ్గారెడ్డి ఏమో కాంగ్రెస్‌లోనే ఉంటూ…కాంగ్రెస్‌కు డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని భావిస్తున్నారు. మొత్తానికైతే జగ్గారెడ్డి రాజకీయం డిఫరెంట్‌గా ఉంది…ఆయన ఏదో టార్గెట్ పెట్టుకునే ఇలా ముందుకెళుతున్నారని అనుమానిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news