సాగర్ బైపోల్:జానారెడ్డి ఎంట్రీతో ప్యూహం మార్చిన బీజేపీ

-

నాగార్జున సాగర అభ్యర్థి విషయంలో కమలం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది.. కాంగ్రెస్ నుండి జనా రెడ్డి బరిలో ఉంటారని స్పష్టం కావడంతో.. బీజేపీ కూడా కొత్త ప్యూహానికి తెరలేపింది.నియోజకవర్గంలో ప్రభావము చూపే బలమైన క్యాడిడేట్ ని సాగర్ నుండి రంగం లోకి దించేందుకు కసరత్తు చేస్తుందట..ఆపరేషన్ ఆకర్ష్ తో కొత్త అభ్యర్ధి వేటలో కమలదళం ఉందన్న చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో జోరుగా నడుస్తుంది.

దుబ్బాక, గ్రేటర్ లో సత్తా చాటిన బీజేపీ తెలంగాణ లో తమకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరుచుకుంది… అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రభావము చూపి ఆ వాతావరణం ని కొనసాగించాలని కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది.. సాగర్ లో తేడా వస్తే దెబ్బ పడుతుందని ఆ పార్టీ భావిస్తోంది… క్షేత్ర స్థాయిలో బీజేపీ కార్యాచరణ ప్రారంభించిన అభ్యర్థి విషయం లో వెనుక ముందాడుతుంది… ఉప ఎన్నికల ఇంచార్జి లని కూడా పార్టీ నియమించింది… అక్కడ పరిస్థితి పై ఒకటి రెండు సర్వేలు కూడా చేయించింది అంట.. పార్టీ పట్ల సానుకూల వాతావరణం ఉన్న అభ్యర్థుల విషయంలోనే పాజిటివ్ ఒపీనియన్ రాలేదు,

అక్కడ సీటు కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదిత రెడ్డి ప్రయత్నిస్తున్నారు.. ఆమె ప్రచారం కూడా మొదలు పెట్టారు.. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మిత్రపక్ష అభ్యర్థి గా పోటీ చేసిన టీడీపీ నుండి పోటీ చేసిన అంజయ్య యాదవ్ కూడా సీటు అడుగుతున్నారు ఆయన కూడా ప్రచారం మొదలు పెట్టారు.. ఇద్దరు కూడా తమకే సీటు కావాలని పట్టు పడుతున్నారట ఇద్దరిని కూర్చో పెట్టి మాట్లాడిన ఎవరు బెట్టు దిగడం లేదట. వీళ్ళిద్దరిలో ఎవరిని పెట్టిన బీజేపీ అక్కడ చెప్పుకోదగ్గ ఇంపాక్ట్ చూపే పరిస్థితి లేదని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన నివేదిత రెడ్డికి 3వేల లోపే ఓట్లు వచ్చాయి..అంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన అంజయ్య యాదవ్ కి 27 వేల ఓట్లు వచ్చాయి.. వీళ్ళతో ముందుకు సాగలేమని పార్టీ అనుకుంటుంది అట.. పార్టీ లోను కొందరు నివేదితకి, మరి కొందరు అంజయ్య యాదవ్ కి టికెట్ ఇవ్వాలని అంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ నుండి జనా రెడ్డి పోటీ చేయడం ఖరారు అయింది.. ఈ నేపథ్యంలో నే బీజేపీ కొత్త వ్యక్తిని బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తుంది.అర్థ అంగ బలం తో పాటు ప్రజల్లో మంచి పట్టున్న నేత కోసం కమలం పార్టీ చూస్తుంది.అధికార టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ రేసులో చాలమంది నేతలు ప్రయత్నిస్తుండటంతో ఆదిశగా కన్నేశారట కమలం పార్టీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news