ఏపీకి రాజధాని లేకుండా మూడేళ్లు పాలించిన ఘనత జగన్ దే…. నాగబాబు సెటైర్

-

ఆంధ్ర ప్రదేశ్ కు మూడేళ్లు రాజధాని లేకుండా పాలించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే అని జనసేన నేత నాగబాబు సెటైర్లు వేశారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. రాజధాని రైతుల ప్రయత్నాలు, న్యాయస్థానం తీర్పు.. ఏపీకి అమరావతే రాజధాని అని నిర్ణయించబడిందని.. పై కోర్టుకు వెళ్లకుండా రాజధాని ఉన్న సీఎంగా మరో రెండేళ్లు పరిపాలించండి అంటూ చురకలు అంటించారు. నా అనుభవంలో చాాలా మంది ముఖ్యమంత్రులను చూశానని.. మంచి, చెడ్డ ముఖ్యమంత్రులను చూశానని.. ఇంత దుర్మార్గమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిని చూడలేదని జగన్ ని విమర్శించారు.

 మీపాలనలో మీ సలహాదారులు, కొద్ది మంత్రులు తప్పా ఎవరూ బాగా లేరని విమర్శించారు. మీరు వచ్చాక రాష్ట్రానికి అప్పులు, తిప్పలు, కష్టాలు వచ్చాయిన ఎద్దేవా చేశారు. గోల్డ్ మెడల్ రావాలంటే అచీవ్ మెంట్ అని.. రోజుకో గోల్డ్ మెడల్ అని.. మరికొంతమంది ప్రెసిడెంట్ మెడల్ సాధిస్తున్నారని.. మద్యం విధానాన్ని విమర్శించారు. ఏపీలో ప్రతీ ఒక్క వ్యక్తి మీద రూ. లక్ష అప్పులు ఉన్నాయని అన్నారు. మన అందరిని నిలబెట్టేందుకు వెన్నెముకగా పవన్ కళ్యాన్ వచ్చారని.. నాగబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...