” 2020 గుజరాత్ 60.64% నుంచి 2022 లో 65.18% కి పెరిగింది.
2019 Andhra 94.88% నుంచి 2022 లో 67.2% కి పడిపోయింది.
పోల్చడంలో కూడా ఇంత తెలివి తక్కువ తనం ఏంటి అన్నయ్యా ?
ఏ విధంగా చూసుకున్నా ఏ కాకి లెక్కలు చెప్పినా జనాలను మోసం చేసేయ్యచ్చు అనే కదా ! నీ ధైర్యం ? ఇక ఆ ఆటలు సాగవు లే అన్నా ! #FailedCMJagan ” అంటూ జనసేన సోషల్ విభాగం మండిపడుతోంది.
ఎందుకిదంతా అంటే..?
శ్రీ సత్య సాయి జిల్లాలో రైతులకు వైఎస్సార్ పంటల బీమా కింద ప్రీమియం చెల్లింపుల్లో భాగంగా సంబంధిత కార్యక్రమాన్ని మంగళవారం (జూన్ 14, 2022) ప్రారంభించారు జగన్. ఇందులో భాగంగానే ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.ఈ సందర్భంగా జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనాత్మకం అయి ఉన్నాయి. పది ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయని ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులు గగ్గోలు పెడుతుంటే, సీఎం మాత్రం మన రాష్ట్రం గుజరాత్ కన్నా గ్రోత్ లో బాగుందని, రిజల్ట్-లో బాగుందని చెప్పడమే వివాదాస్పదంగా ఉంది.
ఇప్పటికే అరవై శాతానికి పైగా ఫలితాలు రావడంతో గడిచిన ఇరవై ఏళ్లలో ఎన్నడూ ఇటువంటి ఫలితాలు రాలేదని విపక్షాలు సైతం మండిపడుతున్నాయి. చదువులు చెప్పే ఉపాధ్యాయులపై అనవసర ఒత్తిళ్లు పెంచిన కారణంగానే ఈ దుః స్థితి నెలకొందని వారంతా ఆరోపిస్తున్నారు. కానీ అవేవీ వినిపించుకోని మరియు పట్టించుకోని విధంగా జగన్ ఇటువంటి విశ్లేషణలు ఇవ్వడం బాలేదని విపక్షం కన్నెర్రజేస్తోంది.
వాస్తవానికి ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా పదోతరగతి పరీక్ష రాసిన విద్యార్థి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. పరీక్ష పేపర్ ప్యాట్రన్ మార్చేయడంతో అస్సలు ఏం జరుగుతుందో తెలియక గందరగోళపడ్డాడు. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు చదువుకు దూరం అయిన విద్యార్థులు ఒక్కసారిగా పదో తరగతి పరీక్షలకు సిద్ధం కాలేదు. కాలేకపోయారు.