బాబుతో కలిసే..పవన్ సీఎం?

-

మొత్తానికి వైసీపీ..టీడీపీ-జనసేనలని కలిసేలా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి వైసీపీకి కావాల్సిందే..టీడీపీ-జనసేన వేరు వేరుగా పోటీ చేయడం..అందుకే టీడీపీకి పవన్ సపోర్ట్ ఇవ్వకుండా ఉండటానికి…దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని చెప్పి పవన్‌కు సవాళ్ళు విసురుతున్నారు. కానీ వైసీపీ చేసే రాజకీయం వల్ల..అనూహ్యంగా టీడీపీ-జనసేనలు కలిసేలా ఉన్నాయి. తాజాగా విశాఖలో జరిగిన సంఘటనల నేపథ్యంలో చంద్రబాబు-పవన్‌కు మద్ధతు ఇచ్చారు..ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడారు.

ఇక పవన్ సైతం..వైసీపీని గద్దె దించే వరకు పోరాడతామని, వైసీపీ ముక్త ఏపీ కోసం పనిచేస్తానని అంటున్నారు. అంటే వైసీపీని నెక్స్ట్ ఎన్నికల్లో ఓడించాలనేది పవన్ కాన్సెప్ట్. అయితే పవన్ సింగిల్‌గా వైసీపీకి చెక్ పెట్టే సత్తా ఉందా? అంటే ఏ మాత్రం లేదనే చెప్పాలి. ప్రస్తుతానికి ఏపీలో జనసేనకు పెద్ద బలం కనిపించడం లేదు. ఏదో కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలం ఉంది..ఇక 10 లోపు సీట్లు మాత్రమే గెలుచుకునే కెపాసిటీ జనసేనకు ఉంది.

ఈ బలంతో వైసీపీకి చెక్ పెట్టడం పవన్‌కు సాధ్యం కాదు. అలాంటప్పుడు వైసీపీ ముక్త ఏపీ అని ఎలా అంటున్నారంటే..టీడీపీతో కలిసే ఉద్దేశంతోనే పవన్ ఆ మాట అంటున్నారని అర్ధమవుతుంది. టీడీపీతో కలిస్తే వైసీపీని గద్దె దించే ఛాన్స్ వస్తుంది. అంటే టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమే అన్నట్లు అర్ధమవుతుంది. పొత్తు లేకపోతే సింగిల్‌గా ఇటు టీడీపీ గాని, అటు జనసేన గాని వైసీపీని ఏం చేయలేవు. అందుకే ఆ రెండు పార్టీలు కలయిక తప్పేలా లేదు.

కాకపోతే పొత్తు ఉంటే పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని ఆ మధ్య జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాము సింగిల్‌గా పోటీ చేసి సత్తా చాటుతామని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇలా పొత్తు విషయంలో విభేదాలు ఉన్నాయి. కానీ మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ-జనసేనలకు ఇబ్బందే. అందుకే ఆ పరిస్తితి రాకుండా ఉండటానికి ఇటు చంద్రబాబు, అటు పవన్ సైతం కొన్ని త్యాగాలకు రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే పవన్ సీఎం సీటు విషయం ఆలోచించే ఛాన్స్ లేదు. అటు బాబు కూడా కొన్ని సీట్లు త్యాగానికి రెడీ అవ్వోచ్చు. మొత్తానికి బాబు-పవన్ కలిసే జగన్‌ని ఢీకొట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news