అనంతపురం టిడిపిలో జేసీ వర్సెస్ వైకుంఠం.. ఆందోళనలో క్యాడర్

-

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనంతపురం టిడిపిలో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. టిక్కెట్ తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ లో వైకుంఠం ప్రభాకర్ వర్సెస్ జేసీ దివాకర్ రెడ్డి గా రాజకీయాలు సాగుతున్నాయి.. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.. అనుచరులు బాహాబాహికి దిగారు.

అనంతపురం అర్బన్ నియోజకవర్గం మీద పట్టు సాధించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. గత ఎన్నికల్లో టిడిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభాకర్, ఎంపీ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.. అయితే ఈసారి అనంతపురం అర్బన్ టికెట్టు ను తన కుమారుడు అస్మిత్ రెడ్డి కి ఇప్పించుకునేందుకు జేసీ పావులు కదుపుతున్నారట . అందులో భాగంగా వైకుంఠం ప్రభాకర్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని పార్టీలో టాక్ నడుస్తుంది .. టికెట్ ఫైట్ తో అనంతపురం అర్బన్ లో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. టిడిపిలో ఉండే రెండు వర్గాలు ఎప్పుడు ఏం చేసుకుంటాయో తెలీయక ఆందోళన చెందుతున్నారట..

ఎమ్మెల్యేగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఎంపీగా జెసి దివాకర్ రెడ్డి ఉన్న సమయంలో వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందట.. ఇప్పుడు టికెట్ కోసం నువ్వా నేనా అంటూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు.. ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు గొడవలకు సైతం దిగుతున్నారని టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని వైకుంఠం ప్రభాకర్ చౌదరి చంద్రబాబును అభ్యర్థించారట. మరోపక్క చేసి దివాకర్ రెడ్డి కూడా తన కుమారుడుకి టికెట్ ఇప్పించుకునేందుకు పావులు కదుపుతూ ఉండడంతో.. అనంతపురం అర్బన్ లో క్యాడర్ అయోమయంలో ఉంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version