కడియం వర్సెస్ రాజయ్య…రచ్చ లేపుతున్నారుగా!

-

అధికార టీఆర్ఎస్ నేతల మధ్య రచ్చ కొనసాగుతుంది…ఎక్కడకక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అంతకముందు అంతర్గతంగా నేతల మధ్య వార్ నడిచేది…కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్ అవ్వాలసిన కారు నేతలు..ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ బయటపడిన విషయం తెలిసిందే…బహిరంగ వేదికల్లో విమర్శలు చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్న చోట పోరు మరింత ఎక్కువ జరుగుతున్న విషయం తెలిసిందే…అలాగే గతంలో టీడీపీ నుంచి వచ్చిన నేతల వల్ల పోరు పెరిగింది. ఆ పోరు అంతర్గతంగా నడిచింది గాని…ఇప్పుడు బహిరంగంగానే నడుస్తోంది. తాజాగా ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలైన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల మధ్య రచ్చ మళ్ళీ బయటపడింది. మొదట నుంచి వీరి మధ్య పోరు ఉంది.

గతంలో కడియం టీడీపీలో, రాజయ్య కాంగ్రెస్‌లో ఉండగా వీరి మధ్య పోరు గట్టిగా జరిగేది. కానీ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఇద్దరు నేతలు టీఆర్ఎస్ లోకి వచ్చారు. అయితే ఇద్దరు ఒకే నియోజకవర్గం కావడంతో రచ్చ మరింత ముదిరిపోయింది. స్టేషన్ ఘనపూర్‌లో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. తాజాగా రాజయ్య..కడియంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పుడు కడియం స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో 360మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్‌ చేయించారని రాజయ్య విమర్శించారు.

దీనికి కడియం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు…తాను టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో 360 మందిని ఎన్‌కౌంటర్‌ చేయించానని మాట్లాడడం సరికాదని, ఆయనకు ఏమైనా ఇబ్బందులుంటే పార్టీ అధిష్ఠానానికో, సీఎం కేసీఆర్‌కో చెప్పుకోవాలని సూచించారు. అలాగే ఎమ్మెల్యే రాజయ్య.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, రాజయ్య చేసిన చిల్లర పనులు, చిలిపి పనులు, అవినీతి రికార్డులు తన వద్ద ఉన్నాయని కడియం ఫైర్ అయ్యారు.

అలాగే స్టేషన్ ఘనపూర్‌లో నాలుగుసార్లు గెలిచిన మగాడివి కదా…నియోజకవర్గ ప్రజలు రాజయ్యను కోరుకుంటున్నారా? కడియంను కొరుకుంటున్నారా? అనే దానిపై ఓ సర్వే చేయిద్దామని కడియం…రాజయ్యకు సవాల్ విసిరారు. ఆ వెంటనే రాజయ్య కూడా కౌంటర్ ఇచ్చేశారు. కడియం శ్రీహరి బ్రతుకు తనకు తెలుసని, భార్యతో దెబ్బలు తిన్న కడియం శ్రీహరి తన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అలాగే దమ్ముంటే స్టేషన్ ఘనపూర్ టికెట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఇలా ఈ సీనియర్ల మధ్య రచ్చ నడుస్తోంది..ఈ రచ్చ వల్ల కారు పార్టీకి ఇంకా డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news