కవిత సర్వే: దుబ్బాక-నిజామాబాద్‌లు లెక్కలో లేవా?

-

రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు లాజిక్‌లు మిస్ అవ్వకూడదు…ఆ లాజిక్‌లు మిస్ అయిపోయి మాట్లాడితే….ఇబ్బందులే వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ నేతలు అదే పనిగా లాజిక్‌లు మిస్ అయిపోతున్నారు. పైకి హుజూరాబాద్ ఉపఎన్నికని తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తూనే….లోపల మాత్రం అక్కడ ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి నానా కష్టాలు పడుతున్నారు. కానీ పైకి మాత్రం హుజూరాబాద్ ఉపఎన్నికని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బీజేపీ మాకు అసలు పోటీ కానే కాదని కే‌టి‌ఆర్, కవితలు మాట్లాడేస్తున్నారు.

తాజాగా అదే ధీమాగా కవిత మాట్లాడారు. ఇక దగ్గర ఉండి సర్వే చేయించారా? అనే విధంగా హుజురాబాద్‌ ఉపఎన్నికల్లోనూ నాగార్జున సాగర్ ఫలితమే వస్తుందని, టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమని కవిత మాట్లాడారు. అసలు బి‌జే‌పి తమకు పోటీనే కాదని అన్నారు. సరే కవితకు నాగార్జున సాగర్ ఫలితాన్ని గుర్తు వస్తుంది గానీ, దుబ్బాక ఫలితం గుర్తు రాకపోవడం కాస్త విచిత్రమే. సరే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టి‌ఆర్‌ఎస్ గెలిచింది…మరి దుబ్బాక ఉపఎన్నికలో పోటీ కాదు అనుకున్న బి‌జే‌పినే…టి‌ఆర్‌ఎస్‌ని చిత్తుగా ఓడించింది. మరి ఈ విషయం కవిత మరిచిపోవడం కాస్త వింతగానే ఉంది.

ఇక బి‌జే‌పి తమకు పోటీనే కాదని అంటున్నారు…మరి ఆ పార్టీ వల్లే కదా కవిత కూడా ఓయిడిపోయారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్‌లో ఏం జరిగిందో కవితకు గుర్తు రాలేదు అనుకుంటా…నిజామాబాద్ పార్లమెంట్‌లో బి‌జే‌పి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతులో కవిత ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఓటమి తర్వాత కవిత రాజకీయాల్లో కొన్ని రోజులు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇక తమ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కవితకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అసలు ఈ లాజిక్‌లన్నీ మరిచిపోయి, నాగార్జున సాగర్ ఫలితమే హుజూరాబాద్‌లో వస్తుంది…బి‌జే‌పి అసలు పోటీనే కాదు అని కామెంట్లు చేయడం కాస్త కామెడీగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news