జగన్ ఫార్ములా ఫాలో అవ్వని కేసీఆర్…టీఆర్ఎస్‌కు షాక్!

-

ఏపీలో జగన్ ( Jagan ) ప్రభుత్వం పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఓ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై విభిన్న వాదనలు కూడా వచ్చాయి. ఇది వర్కౌట్ కాదని కొందరు అంటే, దీని వల్ల సొంత రాష్ట్రం వాళ్ళకు లబ్ది చేకూరుతుందని మరికొందరు మాట్లాడారు. అయితే ఇదే అంశం ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వనుంది.

kcr-jagan
kcr-jagan

ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంపై టీఆర్‌ఎస్‌ నేత, రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్‌ సామ వెంకట్‌ రెడ్డి  కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మంత్రి కేటీఆర్‌కు ఈ అంశాన్ని చెప్పినా సరే పట్టించుకోలేదని, స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తే పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకురారని కేటీఆర్ అన్నారని, అసలు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో, ఎంతమందికి ఉపాధి కల్పించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు.

అలాగే  ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని తాము డిమాండ్‌ చేశామని, తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ డిమాండ్‌ నెరవేరుతుందని టీఆర్‌ఎస్‌తో కలిసి ఉద్యమించామని, కానీ టీఆర్ఎస్ వచ్చాక అది అమలు కాలేదని వెంకటరెడ్డి ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వెంకటరెడ్డి టీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిసింది. తాజాగా ఈయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

ఇక పార్టీ ముఖ్యలతో చర్చించి త్వరలో వెంకట్‌రెడ్డితోపాటు ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. చాలామందికి కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం పోయిందని రేవంత్ విమర్శిస్తున్నారు. మరి అధికార పార్టీలో పదవి ఉండి కూడా వెంకట రెడ్డి టీఆర్ఎస్‌ని వీడుతున్నారంటే, ఓ రకంగా ఆ పార్టీకి షాక్ తగిలినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news