అటు.. చిన్ని గారు.. ఇటు నాని గారు.. అన్నదమ్ముల యుద్ధంపై తీవ్ర ఉత్కంఠ

-

తమ్ముడు తమ్ముడే.. పేకాట.. పేకాటే అన్నట్టు.. ఏపీ రాజకీయాల్లో తోబుట్టువుల్లో రాజకీయం రాజకీయమే అన్నట్టు మారిపోయింది… తన మన భేదం లేకుండా… ఆ ఇద్దరు అన్నదమ్ములు పోటీకి సిద్ధమయ్యారు. దశాబ్దాల ఇంటి పోరు… ఇప్పుడు రాజకీయ యుద్ధంగా మారింది. విజానికైనా… వీర స్వర్గమోనా ఓకే అంటున్నారు. ఇంతకి ఆ అన్నదమ్ములు ఏవరూ? వారి మధ్య ఎందుకీ రాజకీయ వైర్యం మొదలైంది..?

సొంత సోదరులే… రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఆ గట్టు… ఈ గట్టు అంటూ ఏదీ లేదు… ఎవరి గట్స్‌ ఏంటో జనం మధ్యే తేల్చుకుంటామంటూ ఎన్నికల యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. ఇప్పటికే ఇద్దరి అభ్యర్థిత్వాలను ఖరారు చేశాయి ఆయా పార్టీలు… సిట్టింగ్‌ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ అలియాస్‌ నాని ఈసారి వైసీపీ అభ్యర్థిగా విజయవాడ యుద్ధానికి సిద్ధమవగా.. ఆయనకు సవాల్‌ విసురుతున్నారు నాని సొంత సోదరుడు కేశినేని శివనాథ్‌ అలియాస్‌ చిన్ని… ఈ ఇద్దరు అన్నదమ్ముల సమరంతో వైసీపీ వర్సస్‌ టీడీపీ కూటమి పోటీ కాస్తా…. నాని వర్సెస్‌ చిన్ని అన్నట్లు మారిపోయింది.

ఆంధ్ర రాజకీయాలకు కేరాఫ్‌గా చెప్పే విజయవాడలో పాలిటిక్స్‌ ఎప్పుడూ డిఫరెంట్‌గా మారిపోయాయి.. ఆ క్రమంలోనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య సవాల్‌గా పేరిగిపోయాయి.. హేమాహేమీ నేతలు ఎందరో ప్రాతినిధ్యం వహించిన విజయవాడ పార్లమెంట్‌లో ఈసారి బ్రదర్స్‌ మధ్య పోటీ కాకరేపుతోంది. దీంతో రాజకీయ రాజధానిగా నిలిచిన విజయవాడలో లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారిపోయాయి.

అధికార వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నాని.. కొద్ది రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. పార్టీలో చేరిన 24 గంటల్లోనే ఆయనకు టికెట్‌ ఖరారు చేసింది అధికార పార్టీ… గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నాని ఈసారి వైసీపీ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్‌ సాధించాలని తహతహలాడుతున్నారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన కేశినేని నాని… 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లో ప్రవేశించారు. 2014లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా వరుసగా రెండుసార్లు గెలిచిన నాని… ఈ మధ్యే పార్టీ మారారు. తన స్థానంలో కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారని టీడీపీపై తిరుగుబాటు చేశారు ఎంపీ నాని. రెండోసారి గెలిచిన తర్వాత ఎంపీ నానికి… టీడీపీ స్థానిక నేతలకు పెద్ద గ్యాపే వచ్చింది. ఎంపీగా గెలిచిన తనను కాదని అధిష్టానం.. ఇతరుల మాటలు వింటుందని అసంతృప్తికి లోనైన నాని… టీడీపీతో తెగతెంపులు చేసుకున్నారు… ఆ వెంటనే సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్‌ తెచ్చుకున్నారు.

సీఎం జగన్‌ ఆశీస్సులతో మరోసారి పోటీ చేస్తున్న ఎంపీ నాని… హాట్రిక్‌పై నమ్మకం పెట్టుకున్నారు. కానీ, ఆయన విజయ పరంపరకు బ్రేక్‌ వేస్తానని టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా నాని రెండోసారి గెలిచిన తర్వాత నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో తీవ్రంగా విభేదించడంతో అధిష్టానం చాలా కాలం ముందే చిన్నిని రంగంలోకి దింపింది. నానితో సమానంగా చిన్నికి పార్టీలో ప్రాధాన్యమిచ్చింది. అధిష్టానం అండదండలతో చిన్ని కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసి..తనకంటూ సొంత గ్రూపు తయారుచేసుకున్నారు. నేతలతో సమన్వయం చేసుకుంటూ అధిష్టానం అండదండలతో నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్నారు.

ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు తగ్గేదేలే అన్నట్లు పోటీ పడుతుండటంతో…. విజయవాడలో రాజకీయ యుద్ధం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలోని ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్న వైసీపీ…. ఈసారి లోక్‌సభ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేలా పావులు కదుపుతోంది. అయితే.. ఈసారి లోక్‌సభతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది టీడీపీ… దీంతో రెండు పార్టీలకు విజయవాడ లోక్‌సభ స్థానం కత్తిమీద సాములా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news