తెలంగాణ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలపై పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్..ఏపీ రాజకీయాలపై కూడా కాస్త ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మొదట నుంచి వైఎస్సార్ అభిమానులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు జగన్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆ చనువుతోనే ఏపీలో ఒక సీటుని తన సన్నిహితుడుకు ఇప్పించుకోవాలని కోమటిరెడ్డి బ్రదర్స్ ట్రై చేస్తున్నట్లు సమాచారం.
అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోకస్ చేసిన ఏపీ సీటు ఏదో కాదు…టీడీపీ స్ట్రాంగ్‌గా ఉన్న పర్చూరు స్థానం. నల్గొండ జిల్లాకు ఆనుకునే ప్రకాశం జిల్లా ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాలో టీడీపీ సిట్టింగ్ సీటుగా ఉన్న పర్చూరు సీటుని..తమ వ్యాపార భాగస్వామి విన్నకోట రవికి ఇప్పించుకోవాలని కోమటిరెడ్డి బ్రదర్స్ చూస్తున్నట్లు తెలిసింది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రవికి…కోమటిరెడ్డి ఫ్యామిలీతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి.
అలాగే ఈయన సొంత నియోజకవర్గం పర్చూరు. దీంతో కోమటిరెడ్డి ద్వారా సిఫారసు చేయించుకుని పర్చూరు సీటు దక్కించుకోవాలని రవి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత రెండు ఎన్నికల్లో వరుసగా పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు గెలుస్తూ వచ్చారు. ఇక్కడ ప్రస్తుతానికి వైసీపీ ఇంచార్జ్‌గా రావి రామనాథం బాబు ఉన్నారు. అటు ఏలూరి, ఇటు రావి…ఇద్దరు నేతలు కమ్మ వర్గం వారే.
అయితే ఈ సారి ఏలూరికి చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తుంది…కానీ ఏలూరికి చెక్ పెట్టె బలం రావికి ఇంకా రాలేదు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ సిఫారసు చేసే విన్నకోట రవికి సీటు ఇచ్చే విషయాన్ని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పైగా రవి కాపు వర్గానికి చెందిన నేత..పర్చూరులో కాపు ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ పర్చూరు సీటు రవికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరి చూడాలి కోమటిరెడ్డి బ్రదర్స్ పార్ట్‌నర్ రవికి సీటు దక్కుతుందో లేదో.