కోమటిరెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి…జరిగే పనేనా?

-

తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే…చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న రాజగోపాల్…బీజేపీలో చేరడం ఖాయమైంది..మరికొన్ని రోజుల్లోనే ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. పార్టీ మారితే పెద్దగా చర్చ ఉండకపోవచ్చు గాని…ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే అంశమే ఎక్కువ హైలైట్ అవుతుంది.

పదవికి రాజీనామా చేసి మరీ ఆయన…బీజేపీలోకి వెళ్లనున్నారు. దీంతో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక రానుంది…ఇక ఉపఎన్నిక వస్తే బీజేపీ తరుపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ లో పోటీకి పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది.

అయితే మునుగోడు ఉపఎన్నిక గురించి కేసీఆర్ తనతో మాట్లాడలేదని గుత్తా అంటున్నారు. అంటే టీఆర్ఎస్ అభ్యర్ధి అనేది తేలడం లేదు. ఇక కాంగ్రెస్ పరిస్తితికి వస్తే…ఇప్పటికే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ సడన్ గా కాంగ్రెస్ లో ఊహించని పేరు బయటకొచ్చింది. రాజగోపాల్ అన్న..ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మునుగోడు బరిలో దించుతారని ప్రచారం వస్తుంది. ఇంతకాలం కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్లు ఉండేది.

కానీ ఇప్పుడు రాజగోపాల్ తన దారి తాను చూసుకుంటున్నారు. అయితే వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే పనిచేస్తున్నారు. అదే సమయంలో తమ్ముడు పార్టీ మార్పుపై వెంకటరెడ్డి స్పందించడం లేదు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం…మునుగోడులో వెంకటరెడ్డిని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తమ్ముడు మీద పోటీకి వెంకటరెడ్డి ఒప్పుకోవడం జరిగే పని కాదుని తెలుస్తోంది…అలాగే మునుగోడు ఉపఎన్నిక గురించి వెంకటరెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చర్చించిందా? లేదా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికైతే మునుగోడు ఉపపోరు ఆసక్తికరంగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news