కేటీఆర్ ఎత్తులు…ఒకటే టార్గెట్?

-

రాష్ట్రంలో ఉన్న సమస్యలు బయటపడకూడదు..అలాగే ప్రత్యర్ధి పార్టీలు దెబ్బతినాలి..రాజకీయంగా లబ్ది పొందాలి. ఇదే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తుంది..అసలు టీఆర్ఎస్ నేతలు చేసే రాజకీయం చూస్తుంటే…తమ ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరగడం లేదని, తప్పులన్నీ కేంద్ర ప్రభుత్వానివే అనే మాదిరిగా రాజకీయం చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ నేతలు…రాష్ట్రంలోని సమస్యలని హైలైట్ చేస్తే…టీఆర్ఎస్ నేతలు వాటికి కౌంటర్ ఇవ్వకుండా…ఎదురుదాడి చేస్తున్నారు. కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు.

రాజకీయంగా ఏమైనా విమర్శలు వస్తే వాటికి వివరణ ఇవ్వాలి…కానీ టీఆర్ఎస్ నేతలు అలా చేయకుండా బీజేపీపై ఎదురుదాడి చేయాలని చెప్పి, కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడంలో మంత్రి కేటీఆర్ రోజూ అదే పనిలో ఉంటున్నారు. అసలు రాష్ట్రంలో వరదల వల్ల చాలా నష్టం జరిగింది..ఆ పరిస్తితులని ఎలా చక్కదిద్దాలి..బాధితులకు ఎలా అండగా ఉండాలనే అంశాలని వదిలేసి..ఎంతసేపు కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.

ప్రతిరోజూ ట్విటర్ లో అదే పనిగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిత్యం ఏదొక టాపిక్ ని తెరపైకి తీసుకోస్తూనే ఉన్నారు..అయితే మిస్టేక్స్ ఉంటే…వాటిపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేయొచ్చు…కానీ కేటీఆర్ పూర్తిగా కావాలనే కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యల గురించి మాట్లాడుతుంటే…కేంద్రంలోని అంశాల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగా కనిపిస్తోంది. ఎందుకంటే తాము చేసే తప్పులు ఎక్కడ కనబడకుండా…కేంద్రాన్ని టార్గెట్ చేసి రాజకీయంగా పబ్బం గడిపేయాలనేది టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా ఉంది.

అసలు ఏ మాత్రం సంబంధం లేని టాపిక్స్ తీసుకొచ్చి రాజకీయం చేయడంలో కేసీఆర్, కేటీఆర్ లు ముందు ఉంటున్నారు.  రాష్ట్రంలో ఈ సమస్య ఉందని అడిగితే చాలు…అంతా కేంద్రందే అన్నట్లు మాట్లాడుతున్నారు. టోటల్ గా వారి టార్గెట్ కేంద్రమే అని అర్ధమవుతుంది. అంటే రాజకీయంగా విమర్శించడానికి ఏ దారి లేక ఇలా కేంద్రాన్ని బూచిగా చూపించి రాజకీయ లబ్ది పొందాలనే కోణంలో కారు నేతల రాజకీయం ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news