‘బండి’కి కేటీఆర్ పంక్చర్…అందుకే బీజేపీకి మైనస్..

తెలంగాణలో బీజేపీ…అధికార టీఆర్ఎస్‌పై గట్టిగానే పోరాడుతున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ…ఎలాగైనా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి నెక్స్ట్ అధికారంలోకి రావాలని చూస్తుంది. అందుకే తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంటూ, టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్…నిత్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా ప్రభుత్వ పథకాలకు అర్హులై కూడా పథకాలు అందని ప్రజల దగ్గర నుంచి బండి సంజయ్ దరఖాస్తులు తీసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వానికి పంపే కార్యక్రమం మొదలుపెట్టారు.రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇక దీనిపై మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షల అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేస్తుం తెలంగాణ ప్రజలు బీజేపీ నేతలకు దరఖాస్తులు ఇవ్వాలని…జన్‌ధన్‌ అకౌంట్లలోకి ధనాధన్‌ డబ్బులు వస్తాయంటూ కేటీఆర్‌ సెటైర్‌ విసిరారు.

ktr
ktr

అయితే కేవలం ఈ ఒక్క కార్యక్రమం అని కాదు. రాష్ట్రంలో బీజేపీ చేసే ప్రతి పోరాటానికి టీఆర్ఎస్ దగ్గర నుంచి కౌంటర్లు వస్తున్నాయి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, రాష్ట్రంలో ఎలాంటి పోరాటం చేసినా, కేంద్రంలో మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నలు బీజేపీ నేతలకు వస్తున్నాయి.

పైగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం కూడా బీజేపీకి పెద్ద మైనస్ అవుతుంది. ఈ అంశాలపై బీజేపీ నేతలు రాష్ట్రంలో పోరాటం చేయాలని పరిస్తితి ఉంది. ఒకవేళ ఏదైనా పోరాటం చేస్తే, చివరికి వారి మెడకే చుట్టుకుంటుంది. కరోనా నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థని మోదీ ప్రభుత్వం సెట్ చేయిలేక కపోయిందనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణలో బీజేపీకి ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతున్నాయి. ఏదేమైనా కేంద్రంలో అధికారంలో ఉండటం తెలంగాణ బీజేపీ నేతలకు బాగా మైనస్ అయినట్లే కనిపిస్తోంది.