కేజ్రీవాల్ ని చూసి జగన్ – చంద్రబాబు ఇద్దరూ నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాయింట్ ఇదే !

-

సామాన్యుడి పార్టీ గా దేశ రాజకీయాలలో పేరొందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాజకీయాలలో జాతీయ పార్టీలకు చుక్కలు చూపిస్తుంది. గత మూడు సార్వత్రిక ఎన్నికల నుండి ఢిల్లీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుని దేశంలో తల పండిపోయిన నేతలకే మతి పోగొట్టే రాజకీయం చేస్తున్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. రాజకీయాలలో సామాన్యుడిగా అడుగుపెట్టిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సాధిస్తున్న విజయాలు ప్రపంచంలోనే హైలెట్ న్యూస్ గా మారుతున్నాయి.

Image result for kejriwall

తాజాగా జరిగిన మూడో డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ పీఠంపై కూర్చున్నారు అరవింద్ కేజ్రీవాల్. కాగా కేజ్రీవాల్ గెలుపు ని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జగన్ మరియు చంద్రబాబు నేర్చుకోవాల్సింది చాలా ఉందని సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.

 

ఢిల్లీ ప్రజలకు మంచి చేస్తూ ఎప్పటికప్పుడు జవాబుదారీగా వ్యవహరిస్తూ ఎక్కడా కూడా అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా కేజ్రీవాల్ పనిచేయటమే ఆయన విజయానికి నిదర్శనం పైగా జాతీయ పార్టీ బీజేపీని ఓడించడం మరింత గ్రేట్ అంటూ…కేజ్రీవాల్ మాదిరిగా జగన్ మరియు చంద్రబాబు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రాణించాలని తమ స్వార్థం కోసం స్వలాభం కోసం కేంద్రం దగ్గర రాష్ట్ర ప్రజల హక్కులను కాల రాయకూడదు అంటూ సూచిస్తున్నారు. కేజ్రీవాల్ తన పరిపాలనలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా ప్రజలకు మాత్రమే మంచి చేస్తున్నారు అన్నట్టుగా ఒక నిజాయితీ ముఖ్యమంత్రిగా వ్యవహరించడం వల్ల ఢిల్లీలో బలమైన బిజెపి పార్టీ ని ఓడించడం జరిగిందని కేజ్రీవాల్ గెలుపు పై పొగడ్తల వర్షం కురిపించారు. 

Read more RELATED
Recommended to you

Latest news