సీమలో లోకేష్-గోదావరిలో పవన్..మాస్టర్ ప్లాన్.!

-

తెలుగుదేశం-జనసేన పార్టీలు..వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఓ మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎవరికి వారు పనిచేస్తూ..తమ పార్టీలని బలోపేతం చేసుకుంటూనే..తెలివిగా పొత్తు దిశగా మాత్రం ముందుకెళుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు-పవన్ మంచి అండర్‌స్టాండింగ్ తో పనిచేస్తున్నారు. వీరి ఇద్దరి విమర్శలు ఒకేలా ఉంటున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని ఒకేలా విమర్శిస్తున్నారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసుపై కూడా పదే పదే మాట్లాడుతున్నారు.

అన్నిటికంటే చంద్రబాబు మొన్నటివరకు నియోజకవర్గాల పర్యటన చేశారు. కానీ ఎప్పుడైతే పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి బాబు పర్యటనలు చేయడం లేదు. కేవలం పార్టీ పరమైన అంశాల్లోనే ముందుకెళుతున్నారు. అంటే పవన్ ఎలాగో తిరుగుతున్నారు..అదే సమయంలో తాను తిరిగితే మీడియా కవరేజ్ మారిపోతుందని, ప్రజల్లో చర్చ కూడా మారుతుందని ఆలోచించినట్లు ఉన్నారు. అందుకే ఇలా సెట్ చేసుకున్నారు. పవన్ యాత్ర ముగియగానే బాబు రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది.

ఇక పవన్ గోదావరి జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అక్కడ టి‌డి‌పి, జనసేన పొత్తుతో వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కావాలని, అక్కడ యువతకు ఉపాధి, రోడ్లు బాగు చేయడం, అలాగే ఆక్వా రంగం, గ్యాస్ సంబంధిత పనుల వల్ల నీరు, వాయు కాలుష్యం జరుగుతుందని, దాన్ని తగ్గించాలని, జనసేన అధికారంలోకి రాగానే గోదావరి జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తానని పవన్ హామీ ఇస్తున్నారు.

అయితే కొన్ని రోజుల క్రితం లోకేష్ రాయలసీమలో పాదయాత్ర చేస్తూ..సీమకు సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నామని..టి‌డి‌పి అధికారంలోకి రాగానే..సీమకు కొత్త కంపెనీలు, తాగునీరు, సాగు నీరు, ఉద్యోగాలు, హార్టికల్చర్ హబ్‌గా తీర్చి దిద్దుతామని లోకేష్ హామీ ఇచ్చారు. అంటే అటు పవన్ గోదావరి ప్రజలని, ఇటు లోకేష్ సీమ ప్రజలని ఆకట్టుకుని వైసీపీని దెబ్బ తీసే విధంగా స్కెచ్ వేస్తున్నారు. మరి ఈ మాస్టర్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news