చినబాబుని లేపుతున్న వైసీపీ…తోక్కేస్తున్న బాబు…!

-

తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తర్వాత నడిపించే నాయకుడు ఎవరంటే….టీడీపీ నేతలు, కార్యకర్తలంతా నారా లోకేష్ పేరు చెప్పేస్తారు. ఇందులో కొందరికి ఎన్టీఆర్‌పైన ఆశలు ఉన్నాయి గానీ…ఎవరైనా సరే తన వారసుడుని కాదని వేరే వారికి బాధ్యతలు అప్పగించలేరు కదా. అంటే చంద్రబాబు తన తర్వాత లోకేష్‌కే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

nara lokeshఅందుకే 2014లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లోకేష్‌ని రాజకీయంగా యాక్టివ్ చేశారు. ఎమ్మెల్సీని చేసి మంత్రిగా కూడా చేశారు. అయితే డైరక్ట్ ప్రజా మద్ధతుతో పదవిలోకి రాకపోవడం వల్ల లోకేష్‌పై ప్రజల్లో నెగిటివ్ వచ్చింది. అది పార్టీకి డ్యామేజ్ అయింది. అందుకే 2019 ఎన్నికల్లో డైరక్ట్‌గా ఎన్నికల బరిలో దిగితే ఓడిపోయారు. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి లోకేష్ దూకుడు పెరిగింది…దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. తన బాడీ తీరు, మాట తీరు మార్చుకున్నారు.

దీంతో ఇంకా టీడీపీ పగ్గాలు లోకేష్‌కు ఇచ్చేస్తారనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో నెక్స్ట్ గానీ టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ సీఎం అవుతారనే ప్రచారం వస్తుంది. అయితే ఈ ప్రచారం టీడీపీకి పెద్ద డ్యామేజ్ చేసేలా ఉంది. ఎందుకంటే లోకేష్‌కు పాలించే సత్తా ఇంకా లేదని జనం భావిస్తున్నారు. ఆయన్ని ఇంకా పూర్తి స్థాయిలో లీడరుగా చూడటం లేదు. అలాంటప్పుడు ఆయన సీఎం అభ్యర్ధి అంటే టీడీపీకే నష్టం.

ఈ విషయం గ్రహించిన వైసీపీ…చిన్నబాబే కాబోయే సీఎం అని ప్రచారం మొదలుపెట్టింది. అంటే పరోక్షంగా చిన్నబాబుని లేపితే టీడీపీకి డ్యామేజ్ జరుగుతుంది. అందుకే వైసీపీ నేతలు చిన్నబాబుని లేపుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు సైతం…చిన్నబాబుని సైడ్ చేయడం మొదలుపెట్టారు. ఆయనని పూర్తి స్థాయిలో హైలైట్ అవ్వనివ్వడం లేదు. అందుకే ఈ మధ్య కాలంలో చిన్నబాబుని జనంలోకి ఎక్కువ వెళ్లనివ్వడం లేదు. ఆయన్ని మంగళగిరి వరకే పరిమితం చేస్తున్నారు. అంటే చిన్నబాబుని ఇప్పుడు ఆపితేనే నెక్స్ట్ ఎన్నికల్లో ప్లస్ అవుతుందని బాబుకు అర్ధమైంది.

Read more RELATED
Recommended to you

Latest news