తప్పంతా ఓటర్లదే ? నాయకులు అమాయకులే ?

-

గ్రేటర్ హైదరాబాదు లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా ఓటర్లు తీసుకోకపోవడంపై ఓటర్ల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు పవన్ కు దారి తీసిన పరిస్థితులు పైన చర్చ జరుగుతోంది. ఓటు వేయడం అనేది పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు అదే వారికి ఆయుధం తమను ఎవరైతే సక్రమంగా పరిపాలిస్తారో వారికి ఓటు వేసి గెలిపించుకునే బాధ్యతను రాజ్యాంగం కల్పించింది. అయితే గ్రేటర్ ఎన్నికల లో చాలా మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం అందరికీ షాక్ కలిగించింది. భారీ ఎత్తున పోలింగ్ నమోదు అవుతుంది అని అందరూ అంచనా వేసిన మెజార్టీ ఓటర్లు ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇష్టపడకపోవడం తో సర్వత్రా వారి వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలో అయితే..హైదరాబాదీలు బద్ధకస్తులు అని, వాళ్లకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అని, ఓటేయమని అందరూ నెత్తి నోరు కొట్టుకుని తిని పడుకున్నారని, అసలు వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వడమే దండగ అని, వారికి ప్రశ్నించే హక్కు ఎక్కడిది అంటూ ఎన్నో రకాలు గా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హోరు ఎత్తించారు. అందరూ అనుకున్నట్టుగా ఇక్కడ పూర్తిగా ఓటర్ల దే తప్పు ఉందా ? రాజకీయ పార్టీలు, నాయకులు ,ఎన్నికల కమిషన్ తప్పు ఏమీ లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజకీయ పార్టీలు , పార్టీల నాయకులు పడిన కష్టం గుర్తించక పోవడంతో, అన్ని రాజకీయ పార్టీలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే దీనికి కారణం. ఎవరు గెలిస్తే వారికి అధికారం రాబోయే రోజుల్లో దక్కుతుంది అనే అభిప్రాయం ఉండడంతో, అన్ని పార్టీలు నాయకులు తమ శక్తినంతా కూడగట్టుకుని మరి, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీలు రెండూ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. బిజెపి తరఫున జాతీయ స్థాయి నాయకులు అంతా రంగంలోకి దిగి మరీ ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎంతో మంది ప్రముఖులు బిజెపి తరఫన రంగంలోకి దిగారు. ఇక టిఆర్ఎస్ తరఫున కేసీఆర్ కేటీఆర్ వంటి నాయకులు గట్టిగానే ఎన్నికల వ్యూహాలను రచించారు. ఇక కాంగ్రెస్ తరపున రేవంత్ టిడిపి తరఫునఎన్నికల ప్రచారం నిర్వహింంచినాా, పూర్తిగా టిఆర్ఎస్, బిజెపి ల మధ్య పోరు నడిచింది.

ఇంత వరకు బాగానే ఉన్నా, ఎన్నికల ప్రచారం సందర్భంగా నాయకుల మధ్య పార్టీల మధ్య విమర్శలు తీవ్రరూపం దాల్చడం, మత జాతి విద్వేషాలు పెరిగే విధంగా విమర్శలు చేసుకోవడం, ఎన్నికలకు ముందు అనేక ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకోవడం వంటి ఎన్నో కారణాలతో, ఓటర్లు పోలింగ్ రోజున ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉండొచ్చు అనే భయంతో చాలా మంది ఓటింగ్ ప్రక్రియ కు దూరం అయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే జనాల్లో కరోనా భయం తగ్గకపోవడం, ఏ పార్టీ గెలిచినా, తమకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అనే అభిప్రాయం ఉండటం, ఇక ఎన్నికల సంఘం సైతం వరుస సెలవులు ఉన్న సమయంలోనే ఈ ఎన్నికలను నిర్వహించడం, ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోకుండా గత అసెంబ్లీ ఎన్నికల లోని ఓటర్ లిస్ట్ నే నమ్ముకుని ఎన్నికలు నిర్వహించడం, ఇప్పటికే పెద్ద ఎత్తున జనాలు కరోనా భయంతో నగరాన్ని విడిచి బయటకు వెళ్లడం, అసలు ఎంతమంది నగరంలో ఉన్నారు ? ఎంతమంది సొంత తమ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు అనే లెక్కలు లేకపోవడం వంటి ఎన్నెన్నో కారణాలు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. అసలు ఇందులో ప్రజలు.. నాయకులు, అధికారులు, ఇలా అందరి పాత్రా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. అయితే ఇందులో ఎవరి పాత్ర ఎక్కువ అనేదానిపైనే చర్చంతా !!!

 

Read more RELATED
Recommended to you

Latest news