మహారాష్ట పగ్గాలు అతనికే..? మరో రెండు రోజుల్లో సీఎంగా ప్రమాణస్వీకారం..

-

మహారాష్టలో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చింది.. మహావికాస్ అఘాడియాను మట్టికరిపించి.. తమకు తిరుగులేదని నిరూపించింది..అయితే సీఎం ఎవరనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.. బీజేపీ అగ్రనేతల చర్చలతో సీఎం పేరు ఖాయమైంది.. దీంతో ప్రమాణస్వీకారానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.. కూటమిలో బీజేపీ, శివసేన ( ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలు కలిసి పోటీ చేశాయి. బీజేపీ అభ్యర్థులు 132 స్థానాల్లో, శివసేన 57, ఎన్సీపీ అభ్యర్థులు 41 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో సీఎం ఎవరనే చర్చ పెద్ద ఎత్తున నడిచింది.. ప్రస్తుతం ఆపద్దర్మ సీఎంగా ఉన్న షిండేకే పగ్గాలు ఇస్తారా.. లేక బిజేపీ తరపున ఫడ్నవీస్ కు ఛాన్స్ ఉంటుందా అన్న ఉత్కంఠ ఇన్ని రోజులూ సాగాయి.. అయితే ఈ ఉత్కంఠకు బిజేపీ పెద్దలు పుల్ స్టాప్ పెట్టారు..

బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే పేర్లు సీఎం రేసులో ప్రముఖంగా వినిపించాయి. అయితే, ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకునేందుకు బీజేపీ సంసిద్ధంగా లేకపోవడంతో.. ఫడ్నవీస్ కే సీఎం పదవి అంటూ బిజేపీ ప్రచారం మొదలుపెట్టింది.. దీంతో షిండే వర్గం కూడా ప్రకటనలు చేసింది.. దీంతో బిజేపీ పెద్దలు రంగంలోకి దిగారు.. షిండేవర్గంతోపాటు.. అజిత్ పవార్ వర్గంతో చర్చలు జరిపారు..

బీజేపీ పెద్దలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన రెండు పార్టీల మద్దతు కూడా సంపూర్ణంగా ఉండటంతో.. ఆయన ప్రమాణస్వీకారం లాంఛనంగా మారింది.. అయితే కీలక శాఖలను షిండే వర్గానికి, అజిత్ పవార్ వర్గానికి ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.. మొత్తంగా సీఎం పదవి విషయంలో బిజేపీ పట్టునిలుపుకుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version