గ్రేటర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పక్కా స్ట్రాటజీ

-

గ్రేటర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పక్కా స్ట్రాటజీ ఫాలో అవుతోంది. అన్న కమలం పువ్వును టార్గెట్ చేస్తే… తమ్ముడు గులాబీ పార్టీని ఏకిపారేస్తున్నారు. ఏ ర్యాలీలో పాల్గొన్న ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారు ఓవైసీ బ్రదర్స్‌. మజ్లిస్‌ అంటేనే ఓవైసీ బ్రదర్స్‌. ఆ పార్టీకి వీరిద్దరే స్టార్ క్కాంపైనర్లు. అన్నదమ్ముల్లు ఇద్దరు ఇద్దరే. భావోద్వేగ ప్రసంగాలతో ముస్లీం ఓటర్లను ఆకట్టుకోవడంలో మంచి ఎక్స్‌పర్ట్స్. పంచ్‌లు, ప్రాసలు, డైలాగ్స్‌తో ఎట్రాక్ట్‌ చేస్తుంటారు. ముక్కుసూటిగా చెప్పాలనుకున్నది స్ట్రైట్‌గా చెప్పేస్తారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ అలానే దూసుకెళ్తున్నారు. ఐతే.. అన్ని పార్టీల్లా కాకుండా కొద్దిగా డిఫరెంట్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు ఈ బ్రదర్స్‌.

అసదుద్దీన్‌ ఓవైసీ… కేంద్రాన్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. బీజేపీపై ఒంటికాలితో లేస్తారు. మోడీ, అమిత్‌షా నుంచి మొదలుకొని కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరకూ అందర్నీ ఏకిపారేస్తారు. బీజేపీ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తారు. ఎవ్వరినీ వదిలిపెట్టరు. ఎన్డీఏ సర్కార్‌ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు. లాజిక్ పాయింట్లను ప్రస్తావిస్తూ…ఓటర్లను ఆకట్టుకుంటారు. అది జనరల్‌ ఎలక్షన్ అవ్వనీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అవ్వనీ… ఎన్నిక ఏదైనా ఆయన టార్గెట్‌ కమలం. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలోనూ అదే ఫాలో అవుతున్నారు. మొన్న రోహింగ్యాల గురించి ప్రస్తావిస్తూ అమిత్‌షాను ప్రశ్నించారు. నగరంలో రోహింగ్యాలు ఉంటే అమిత్‌షా ఏం చేస్తున్నారని నిలదీశారు.

ప్రధాని మోడీని సైతం ఎన్నికల ప్రచారంలోకి లాగారు అసద్‌. హైదరాబాద్‌కు బీజేపీ నేతలంతా వస్తున్నారని… మీరు కాదు… మోడీని తీసుకురండని ఆయన సవాల్‌ విసిరారు. బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ కామెంట్ల విషయంలోనూ…మోడీని టార్గెట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సింది దేశ ప్రజలపై కాదని, లద్దాఖ్‌లో అక్రమ చొరబాటు చేసిన చైనాపై చేయాలని సూచించారు.

అసద్ తమ్ముడు అక్బర్‌ టార్గెట్ టీఆర్‌ఎస్‌. ఎంఐఎంతో పొత్తు లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ధీటుగా జవాబిచ్చారు. తమకు ఎవరి కింద బతకాల్సిన దుస్థితి లేదని అన్నారు. అసెంబ్లీలో తోకను తొక్కి టీఆర్ఎస్ ను ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో తమకు తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో అప్పుడు బీజేపీకి మద్ధతు తెలిపింది టీఆర్‌ఎస్‌ కాదా అని ప్రశ్నించారు అసద్‌. అప్పుడు ప్రధానిని కేసీఆర్‌ వెనుకేసుకొచ్చారని గుర్తు చేశారు. ఇక టీఆర్ఎస్‌ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్‌లపై అసద్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు. ఓ పిచ్చొడూ సమాధులు కాల్చాలంటున్నాడంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news