మ‌ల్లారెడ్డి బ్లాక్ మెయిలింగ్ ఆరోప‌ణ‌ల‌పై అనేక అనుమ‌నాలు.. అస‌లు నిజ‌మేనా..

-

తెలంగాణ‌లో ఇప్పున‌డు మంత్రి మ‌ల్లారెడ్డికి అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ఓ రేంజ్ లో ఫైర్ వార్ న‌డుస్తోంది. ఇద్ద‌రిలో ఎప్పుడు ఎవ‌రు బాంబు పేల్చుతారో అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్ప‌డు వీరిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ వింటే మ‌రీ ముఖ్యంగా మ‌ల్లారెడ్డి చెప్పిన మాట‌లు వింటే మాత్రం నిజంగా వీరి మ‌ధ్య వైరం ఇప్ప‌టిది కాద‌ని చాలా రోజుల క్రిత‌మే వీరి న‌డుమ ఈ వార్ న‌డుస్తోంద‌ని తెలుస్తోంది. అయితే రెండోసారి ప్రెస్ మీట్ సంద‌ర్భంగా మంత్రి మ‌ల్లారెడ్డి చెప్పిన మాట‌లే ఇప్పుడు పెద్ద చర్చ‌నీయాంశంగా మారాయి.

malla reddy

త‌న‌ను రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచే బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని, తాను మంత్రి అయిన త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాగా తాను మాత్రం బ్లాక్ మెయిలింగ్‌కు లొంగిపోయే వ్యక్తిని కాద‌ని చెప్తూనే మ‌ళ్లీ బ్లాక్ మెయిల్ చేశాడంటూ సంచ‌ల‌నం రేపుతున్నారు. కాగా ఇప్పుడు మ‌ల్లారెడ్డి మంత్రిగా ఉన్నా కూడా ఎలా బ్లాక్ మెయిల్ చేస్తారంటూ అంతా చ‌ర్చించుకుంటున్నారు.

ఎందుకంటే ఒక అధికార పార్టీలో ఉన్న మంత్రిని బ్లాక్ మెయిల్ చేస్తే ఆయ‌న ఒక్క ఫిర్యాదు ఇచ్చినా క‌థ వేరే లాగా ఉంటుంది. మిగిలిన విషయాలను పోలీసులే చూసుకుని త‌న మీద ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా చూసుకుంటారు. మ‌రి అధికార పార్టీలో ఉన్న మ‌ల్లారెడ్డికంటే కూడా రేవంత్‌కు ఎక్కువ అధికారాలు ఉండ‌వు క‌దా. కేసీఆర్‌కు ఒక్క మాట చెప్పినా ఆయ‌నే మొత్తం చూసుకుంటారు క‌దా అని అంతా మాట్లాడుతున్నారు. మ‌రి ఇన్ని అవ‌కాశాలు ఉన్నా కూడారేవంత్ ఎలా బ్లాక్ మెయిల్ చేస్తారంటూ అంతా అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news