మెదక్‌లో కారుకు కమలం డ్యామేజ్..లీడ్ ఎవరిది?

-

మెదక్ పార్లమెంట్..ఒకప్పుడు కాంగ్రెస్..ఇప్పుడు బీఆర్ఎస్ కంచుకోట. ఇక్కడ పూర్తిగా బి‌ఆర్‌ఎస్ హవానే నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ లోగాని, పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో గాని బి‌ఆర్‌ఎస్ విజయాలు సాధిస్తూ వస్తుంది. మొదట మెదక్ పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే..ఇక్కడ మెజారిటీ సార్లు కాంగ్రెస్ గెలిచింది. 1984లో టి‌డి‌పి ఒకసారి, 1999లో టి‌డి‌పితో పొత్తులో భాగంగా బి‌జే‌పి ఒకసారి గెలిచింది.

2004 నుంచి బి‌ఆర్‌ఎస్ విజయం అందుకుంటూ వస్తుంది. 2004లో ఆలె నరేంద్ర, 2009లో విజయశాంతి మెదక్ ఎంపీ గా గెలిచారు. 2014లో కేసీఆర్ గెలిచారు. కాకపోతే గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలో బి‌ఆర్‌ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి  పోటీ చేసి గెలిచారు. 2019లో కూడా ఆయనే విజయం సాధించారు. ఇక వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ లో బి‌ఆర్‌ఎస్ హవా నడిచే ఛాన్స్ ఉంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిన కేసీఆర్..ఇక్కడ పోటీ చేసే ఛాన్స్ కూడా ఉంది.

ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల గురించి వస్తే..సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో సిద్దిపేట హరీష్ రావు, గజ్వేల్ లో కే‌సి‌ఆర్ ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఒక్క సంగారెడ్డి మినహా మిగిలిన స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాకలో బి‌జే‌పికి లీడ్ వచ్చింది.

దుబ్బాక ఉపఎన్నికలో కూడా బి‌జే‌పి గెలిచింది. దీంతో మెదక్ పరిధిలో కారు-కమలం మధ్య గట్టి పోటీ ఉండేలా ఉంది. కాకపోతే గజ్వేల్, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్ లో బి‌ఆర్‌ఎస్ హవానే ఉండేలా ఉంది. మరి ఈ సారి ఎన్నికల్లో మెదక్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news