అసెంబ్లీలో మంత్రి వర్సెస్ చంద్రబాబు…!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆరో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వంపై విపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలను మంత్రి కన్న బాబు తిప్పికొట్టారు. ఎస్సీ, ఎస్టీ నిధులపై జరిగిన చర్చలో భాగంగా… ఎస్సీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు స్పష్టం చేసారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రోజున వైసీపీ సభకు రాలేదన్నారు. ఎస్సీ విద్యార్ధులకు న్యాయం చేసింది తమ పార్టీ నే అన్నారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ఏటా 10 వేల కోట్ల ఖర్చు పెట్టమన్నారు.

తాను అన్ని మాటలను అన్నట్టు చిత్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ కావాలని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు ఉందని చంద్రబాబు అసెంబ్లీలో ఎద్దేవా చేసారు. ఇక దీనిపై స్పందించిన మంత్రి కన్నాబాబు… ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసమే పుట్టినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు ప్రతీ ఒక్కటి వక్రీకరిస్తున్నారని, ఆయన వక్రీకరణ మానుకోవాలని హితవు పలికారు.

దిశా చట్టం ప్రవేశ పెట్టిన ఘనత వైఎస్ జగన్ ది అన్నారు. రిషితేశ్వరి ఘటనపై చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడారా…? అయేషా మీరా హత్యా కేసుని తెలుగుదేశం హయాంలో పరిష్కరించారా అని కన్నబాబు నిలదీశారు. గత అయిదేళ్ళలో చంద్రబాబు మహిళల గురించి ఆలోచించరా…? అని ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ నిధులను దొంగ దీక్షలకు ఖర్చు పెట్టారు. సిఎం జగన్ ని తప్పుబట్టడమే చంద్రబాబు ప్రధాన ఎజెండా అంటూ మంత్రి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news