వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వైసీపీ సమాలోచనలు చేస్తోంది. ఓ రాజకీయ పార్టీకి విధివిధానాల రూపకల్పన అన్నది ఓ బాధ్యత కనుక ఇలాంటి పనులు చేయడంలో ఎటువంటి తప్పిదం లేదు. ముందస్తు వ్యూహం ఫలిస్తే ముద్రగడను తెరపైకి తెచ్చి రాజ్యసభకు పంపాలన్నది వైసీపీ యోచన. తద్వారా కాపు సామాజిక వర్గానికి సానుకూల సంకేతాలు పంపాలన్నది మరో యోచన. ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందాలన్నది, టీడీపీకి చెక్ పెట్టాలన్నది కూడా జగన్ మరో పటిష్ట ప్రణాళిక.. ఏమౌతుందో? ఇక! లెట్స్ వెయిట్..
ఆంధ్రావని రాజకీయాల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా గుర్తింపు పొందింది కాపు సామాజికవర్గమే అన్నది కాదనలేని వాస్తవం. ఎవరు ఔనన్నా కాదన్నా ఇదే నిజం. తూర్పు ప్రాంతం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకూ కాపు సామాజిక వర్గ ప్రాబల్యం అంతా ఇంతా కాదు. రాజ్యాలను శాసించగలరు.. రాజులను మార్చగలరు. ఓ విధంగా అధికార వర్గం మొత్తం వాళ్లదే కానీ తెరపై కనిపించేది కొందరే! మిగతా వారంతా తెర వెనుకే ఉండి ప్రభుత్వాలను తమకు అనుగుణంగా మార్చుకున్న సందర్భాలూ అనేకం. బొత్స లాంటి లీడర్లు ఇందుకు ఓ ఉదాహరణ.
తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ టికెట్ల కేటాయింపుపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గానికి పెద్దగా పరిగణించే ముద్రగడను రాజ్యసభకు పంపాలని యోచిస్తున్నారు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇదే గనుక జరిగితే కాపు సామాజికవర్గానికి మంచి స్థానమే దక్కించిన వారు అవుతారు.
అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఇదే నియామకాన్ని తమకు అనుగుణంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది వైసీపీకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరు కు కానీ ముద్రగడకు కానీ ఆ ఛాన్స్ ఇస్తే రాజకీయంగానూ సామాజిక వర్గ సమీకరణాల సముతుల్యత పరంగానూ న్యాయం చేసిన తీరు ఎంతగానో ఉపయోగపడనుందని వైసీపీ అంచనా వేస్తుంది. ఇవన్నీ భవిష్యత్ రాజకీయాల కోసమే అన్నది కాదనలేని వాస్తవం. మరి! ఆ ఇద్దరిలో ఎవరు?