మునుగోడు సర్వే: వారికే అనుకూలం..!

-

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…బీజేపీ చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆ రాజీనామాని స్పీకర్ ఆమోదించడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. సాధారణ ఎన్నికల ముందు ఈ ఉపఎన్నిక జరగనుండటంతో అన్నీ పార్టీలు ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఎలాగైనా ఈ ఉపఎన్నికలో గెలిచి తీరాలని ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీలు ట్రై చేస్తున్నాయి. ఈ ఉపఎన్నికలోనైనా సత్తా చాటాలని కాంగ్రెస్ కూడా చూస్తుంది. మొత్తానికి మునుగోడులో ముక్కోణపు ఫైట్ నడవనుంది. అయితే ఇప్పటికే మూడు పార్టీలు మునుగోడులో ప్రచారానికి దిగేసాయి. అలాగే మునుగోడు గెలుపోటములపై పలు సంస్థలు సర్వేలు కూడా చేస్తున్నాయి. ఇక పార్టీలు కూడా తమ సొంత సర్వేలు చేసుకుంటున్నాయి.

ఇక్కడ ఎవరికి వారు తమకే సర్వేలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్…మునుగోడులో సర్వే గురించి చెప్పారు. మునుగోడులో బీజేపీ అసలు పోటీలోనే లేదని, సర్వేల ప్రకారం టీఆర్‌ఎ్‌సకు 41 శాతం, కాంగ్రెస్‌కు 32 శాతం, బీజేపీకి 8 నుంచి 9 శాతం ఓట్లు మాత్రమే వస్తాయిని చెప్పారు. మునుగోడులో రైతుబంధు లబ్ధిదారులే లక్షమంది ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఇక మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువని…తమకు గత ఎన్నికల్లో 97 వేల ఓట్లు పడ్డాయని, ఆ ఓట్లు ఇప్పుడు పడితే 40 వేల మెజారిటీ వస్తుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లో మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని…టీఆర్ఎస్ రెండో స్థానం, బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని చెబుతున్నారు. అటు బీజేపీ సైతం మునుగోడులో సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని చెబుతుంది. కోమటిరెడ్డి ఇమేజ్, కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఓట్లు షిఫ్ట్ అవుతాయని, అలాగే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు వస్తాయని, కాబట్టి గెలుపు తమదే అని అంటున్నారు. మరి చివరికి మునుగోడు ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news