ఏపీ ప్రజలకు బిగ్‌ అల్టర్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు

-

ఏపీ ప్రజలకు బిగ్‌ అల్టర్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వానలు కురవనున్నాయి. దక్షిణ ఆగ్నేయ దిశగా వేస్తున్న గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు గాను, అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం నాటి నివేదికలో వెల్లడించింది.

ప్రధానంగా కోస్తాంధ్ర, యానం, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణ రాష్ట్రంలోనూ స్వల్పంగా చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news