మునుగోడు గేమ్ మొదలైంది…కోమటిరెడ్డికి అదే పెద్ద ప్లస్!

-

మునుగోడు గేమ్ ఇప్పుడే మొదలైంది..కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు…అలాగే రాజీనామా పత్రాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేయడం…ఇక రాజీనామా అందిన వెంటనే నిమిషాల్లో రాజీనామాని స్పీకర్ ఆమోదించడం జరిగిపోయాయి. కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. రాజీనామా చేసిన కొన్నినిమిషాలకే ఆమోదం లభించింది.

ఈ రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక గేమ్ మొదలైంది…అయితే రాజీనామా ఆమోదించే విషయంలో స్పీకర్ తాత్సారం చేయొచ్చని మొదట ప్రచారం జరిగింది..కానీ వెంటనే రాజీనామా ఆమోదించి బంతిని ఎన్నికల సంఘం కోర్టులో పడేశారు. ఇక ఉపఎన్నిక నిర్వహించాలనేది ఎన్నికల సంఘం చేతుల్లో ఉంది. అయితే ఉపఎన్నికలో రాజగోపాల్ బీజేపీ నుంచి పోటీ చేయడం ఖాయమే.

ఇక టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని అనుకుంటున్న రాజగోపాల్ పార్టీకి అతి పెద్ద ప్లస్ ఏదైనా ఉందంటే…అది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం. ఎందుకంటే ఇంతకాలం వేరే పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని కేసీఆర్ ఏ విధంగా టీఆర్ఎస్ లోకి తీసుకున్నారో అందరికీ తెలిసిందే…పదవులకు రాజీనామా చేయించకుండా పార్టీలోకి లాగారు. అలాగే కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇలా చేయడాన్ని ప్రజలు ఏ మాత్రం హర్షించడం లేదు.

కానీ వేరే పార్టీలోకి వెళ్ళేటప్పుడు…ముందు ఉన్న పార్టీకి రాజీనామా చేయడం, పదవులకు రాజీనామా చేయడం చాలా పెద్ద ప్లస్. ఆ విషయం ఈటల రాజేందర్ విషయంలో రుజువైంది..ఇప్పుడు ఇదే అంశం కోమటిరెడ్డికి ప్లస్ కానుంది…అలాగే టీఆర్ఎస్ పై వ్యతిరేకత…తన సొంత ఫాలోయింగ్, కేంద్రం సపోర్ట్ లాంటి అంశాలు కోమటిరెడ్డిని విజయం వైపు నడిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ కూడా రాజగోపాల్ రెడ్డికి ఉంటుందని చెప్పొచ్చు. మొత్తానికి చూస్తే రాజీనామా అనేది రాజగోపాల్ రెడ్డికి ప్లస్.

Read more RELATED
Recommended to you

Latest news