రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసీపీ రౌడీలు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తున్నాను. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదు.
ఇదేనా.. మీరు చెప్పిన రాజన్న రాజ్యం.. అంటూ ఏపీ మాజీ మంత్రి, మాజీ సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ ట్విట్టర్ లో రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ ట్విట్టర్ లో ట్వీట్లతో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు లోకేశ్.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసీపీ రౌడీలు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తున్నాను. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదు.
గుంటూరు జిల్లా మాచవరం మండలం, పిన్నెల్లి గ్రామంలో టీడీపీకి ఓటు వేశారని రైతులను ఐదేళ్లు గ్రామ బహిష్కరణ చేశారు. నెల్లూరు వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదల గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారు. మా కార్యకర్తలపై 100కు పైగా దాడులు చేశారు. ఇదేనా.. మీరు చెప్పిన రాజన్న రాజ్యం.
పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి ఇకనైనా ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాను.. అంటూ నారా లోకేశ్ ట్వీట్ల వర్షం కురిపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వైకాపా రౌడీలు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తున్నాను. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదు.
— Lokesh Nara (@naralokesh) June 16, 2019
గుంటూరు జిల్లా మాచవరం మండలం, పిన్నెల్లి గ్రామంలో తెదేపాకు ఓటు వేశారని రైతులను ఐదేళ్లు గ్రామ బహిష్కరణ చేశారు, నెల్లూరు వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదల గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారు. మా కార్యకర్తలపై 100కు పైగా దాడులు చేశారు. ఇదేనా.. మీరు చెప్పిన రాజన్న రాజ్యం ? pic.twitter.com/QvMfcPb1i1
— Lokesh Nara (@naralokesh) June 16, 2019
పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి ఇకనైనా ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాను.
— Lokesh Nara (@naralokesh) June 16, 2019