అనుకున్నదే తడవుగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత తన నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించడం, శాసనసభలో ఓటింగ్ నిర్వహించడం దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపటం అన్న చక చకా జరిగిపోయాయి. అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు దాని కేంద్రం ఆమోదిస్తుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
వాస్తవానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని గాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని కలవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లి వారిని కలవడం అనేది చాలా కష్టంగా మారింది.
ఇలాంటి తరుణంలో ఉభయ సభల్లో ఆమోదం పొందే విధంగా జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు వైసీపీ నేతలను కూడా కలవరపెడుతున్న ప్రశ్న. ఒకవేళ మండలి రద్దుని కేంద్రం ఆమోదించకపోతే జగన్ అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది అనేది వైసిపి కార్యకర్తలను వేధిస్తుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఇప్పుడు వందలాది బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.
అలాంటిది ఒక అత్యవసరం కాని బిల్లును కేంద్రం ఏ విధంగా ఆమోదిస్తుంది, దాని మీద ఏ విధంగా ఓటింగ్ నిర్వహిస్తారు అనేది ఇప్పుడు వైసీపీ నేతలను కూడా వేధిస్తున్న ప్రశ్న. ఒకవేళ తేడా వస్తే జగన్ కు కేంద్రం మద్దతు లేదు అనే అనుమానాలు ప్రజల్లో బలపడే అవకాశాలు ఉన్నాయి