ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…ఎప్పటికప్పుడు పైచేయి సాధించేందుకు చూస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ,…టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టి ఇంకా ఎదగకుండా చేయాలని వైసీపీలు చూస్తూనే ఉన్నాయి. అలాగే కుప్పంలో చంద్రబాబుకు కూడా చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకోవాలని వైసీపీ…అసలు జగన్ కు 175 కాదు కదా…గత ఎన్నికల్లో గెలిచిన 151 సీట్లలో 15 సీట్లు కూడా గెలవడం కూడా కష్టమే అని టీడీపీ అంటుంది. అలాగే జగన్ కు పులివెందులలోనే చెక్ పెట్టి 160 సీట్లు సాధించి సత్తా చాటాలని టీడీపీ చూస్తుంది.
అయితే ఇలా ఎప్పటికప్పుడు వైసీపీ, టీడీపీ…ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇక బాబుకు చెక్ పెట్టడానికి వైసీపీ కొత్త ప్రత్యర్ధిని కుప్పం బరిలో దించాగా, పులివెందులలో జగన్ కు చెక్ పెట్టాలని టీడీపీ కొత్త ప్రత్యర్ధిని ఫిక్స్ చేసింది. గత రెండు ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుపై చంద్రమౌళి పోటీ చేసి ఓడిపోతూ వస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోతున్నారు.
అయితే చంద్రమౌళి అనారోగ్యంతో చనిపోవడంతో, ఆయన తనయుడు భరత్ ని కుప్పం వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ సారి కుప్పంలో చంద్రబాబుకు భరత్ చెక్ పెడతారని వైసీపీ అంటుంది. కంచుకోట లాంటి కుప్పంలో బాబుకు చెక్ పెట్టడం అనేది మాటలు కాదు. అక్కడ ఆయన మెజారిటీ తగ్గించిన చాలా గ్రేట్ అని చెప్పొచ్చు..గత ఎన్నికల్లో చంద్రబాబుకు 30 వేల మెజారిటీ వచ్చింది…అది భరత్ తగ్గిస్తే చాలావరకు సక్సెస్ అయినట్లే.
ఇక పులివెందులలో జగన్ పై…సతీశ్ రెడ్డి పోటీ చేస్తూ వచ్చారు… గత ఎన్నికల్లో 90 వేల మెజారిటీ తేడాతో ఓడిపోయారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో సతీశ్ టీడీపీని వీడి రాజకీయాలకు దూరమయ్యారు. దీంతో పులివెందులలో టీడీపీ అభ్యర్ధిగా బీటెక్ రవిని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పై బీటెక్ రవి పోటీ చేయనున్నారు. ఇక ఇక్కడ జగన్ ని ఓడించడం అసాధ్యం..కాకపోతే ఆయన మెజారిటీని 50 వేలకు తగ్గిస్తే గొప్ప విషయమే.