ఏపీలో కొత్త రాజకీయం… పొత్తుకు జగన్ రెడీ..?

-

ఏపీలో కొత్త పొత్తులు మొదలవ్వబోతున్నాయని తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒంటరిగానే ఉంటోన్న అధికారపక్ష వైసీపీ.. తన రాజకీయం తానూ అన్నట్లుగానే అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి అలా కాకూడదని.. తమకు కూడా మిత్రులు ఉండాలని భావిస్తోందట! దీంతో ఏపీలో వైకాపా కొత్త రాజకీయం తెరపైకి రాబోతుందనే కథనాలు వెలువడుతున్నాయి.

jagan
jagan

సాధారణంగా… అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలకు కొందరు మిత్రులు ఉంటుంటారు. వారిలో కొంతమంది అధికారికంగా ఉంటే.. మరి కొందరు తెరవెనుక రాజకీయం చేస్తుంటారు. ఇది పక్కా రాజకీయ వ్యూహం! కానీ వైసీపీ మాత్రం సోలోగానే పాలిటిక్స్ చేస్తూ వస్తోంది. అయితే… ఈసారి అలా జరగకూడదని.. మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోందంట!

అవును… జగన్ విషయంలో చిల్లర రాజకీయాలు చేయకుండా.. సిద్ధాంతపరంగా మాత్రమే విమర్శలు చేసే కామ్రెడ్ పార్టీగా ఉన్న సీపీఎం ను మిత్రులుగా చేసుకోవాలని జగన్ భావిస్తున్నారంట. వచ్చే ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులను అధిగమించాలంటే.. సీపీఎం తో జత కట్టడం మంచిది అని వైసీపీ అగ్ర నాయకత్వం భావిస్తోందిట. దీంతో… వీలైనంత తొందర్లో ఈ రెండు పార్టీల పొత్తు పొడవనుందని తెలుస్తోంది.

అయితే.. నిత్యం బాబు బజనలో బిజీగా ఉంటుందనేదనే పేరు సంపాదించుకున్న మరో ఎర్రపార్టీ సీపీఐ కూడా ఏపీలో ఉంది! అయితే… ఆ పార్టీ నేత రామకృష్ణకు నిత్యం పసుపురంగు పూసుకోవడం ఆసక్తి అని.. ఎర్ర జెండా చాటున పసుపు రాజకీయాలు చేస్తారనే మాట రాజకీయవర్గాల్లో విపరీతంగా వినిపిస్తుంటుంది. కాబట్టి… ఎర్ర సపోర్ట్ కావాలంటే కచ్చితంగా జగన్.. సీపీఎం తో జతకట్టడం మంచిదనే అభిప్రాయం కూడా పార్టీలో వినిపిస్తోందంట!

కాగా… 1983లోనే సంజయ్ విచార్ మంచ్ తో.. ఆ తరువాత బీజేపీ – వామపక్షాలు ఇలా వీలు కుదిరినపుడల్లా మారుస్తూ.. అనంతరం టీ.ఆర్.ఎస్… 2018 ఎన్నికల వేళ తెలుగు తమ్ముళ్ళకే షాక్ ఇస్తూ తెలంగాణాలో కాంగ్రెస్ తో కూడా చేతులు కలిపిన పార్టీగా టీడీపీ పొత్తుల సంగతి సంగతి తెలిసిందే!

 

Read more RELATED
Recommended to you

Latest news