నిజామాబాద్‌లో ట్విస్ట్..లీడ్ ఎవరిది?

-

తెలంగాణలో ఈ సారి త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగేలా ఉంది. ఇంతకాలం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడిచింది..కానీ ఇప్పుడు బీజేపీ కూడా రేసులోకి వచ్చిన విషయం తెలిసిందే. అసలు కాంగ్రెస్ పార్టీని క్రాస్ చేసి ముందుకెళ్లి..బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని చెప్పి బి‌జే‌పి చూస్తుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో బి‌జే‌పికి బలమైన నాయకులు, క్యాడర్ లేరు. ఏదో కొన్ని స్థానాల్లోనే బి‌జే‌పికి బలమైన నాయకత్వం కనిపిస్తుంది.

అలా బలమైన నాయకత్వం ఉన్న స్థానాల్లో నిజామాబాద్ కూడా ఒకటి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బి‌జే‌పి ఇప్పుడుప్పుడే బలపడుతుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి అక్కడ బి‌జే‌పి బలం పెరుగుతుంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బి‌జే‌పి చిత్తుగా ఓడింది. అటు కాంగ్రెస్ సైతం ఒక్క సీటు గెలవలేదు. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కొరట్ల, జగిత్యాల స్థానాలని బి‌ఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.

కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని బి‌జే‌పి గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో నిజామాబార్ అర్బన్, బోధన్ మినహా మిగిలిన స్థానాల్లో బి‌జే‌పికి ఆధిక్యం వచ్చింది. అందుకే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సత్తా చాటాలని బి‌జే‌పి ప్లాన్ చేసింది. అయితే అనుకున్నంత ఈజీగా పార్లమెంట్ పరిధిలో గెలవడం కష్టం.

ఇక్కడ మెజారిటీ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ బలంగా కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం స్ట్రాంగ్ గా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీని వీక్ చేస్తూ బి‌జే‌పి బలపడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సారి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్యే ప్రధాన పోరు జరిగేలా ఉంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో నిజామాబాద్ పార్లమెంట్‌ పరిధిలో బి‌ఆర్‌ఎస్ పార్టీకే లీడ్ కనిపిస్తుంది. మరి ఎన్నికల నాటికి లీడ్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news